Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కంటే ముందు రాజస్థాన్ రాయల్స్ కు ( Rajasthan Royals ) భారీ ఊరట లభించింది. ఆ జట్టులోకి డేంజర్ ఆటగాడు వస్తున్నాడు. మొన్నటి వరకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్… ఆడేది నమ్మకంగా ఎవరు చెప్పలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో మొదటి మూడు మ్యాచ్లకు సంజు శాంసన్ ( Sanju Samson ) దూరం అయ్యే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను పటాపంచలు చేస్తూ అదిరిపోయే శుభవార్త చెప్పింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ( Sanju Samson ) చేరిపోయాడు. తాజాగా అతని జట్టులో చేర్చుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
Also Read: Hardik Pandya: ప్రియురాలితో శ్రీలంక ట్రిప్.. అడ్డంగా దొరికిపోయిన టీమిండియా ప్లేయర్ ?
గాయం నుంచి కోల్కున్న సంజు శాంసన్ ( Sanju Samson )… ఫిట్నెస్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చేసాడు సంజు శాంసన్. ఇంగ్లాండ్ తో జరిగిన టి20 మ్యాచ్ లో తన చూపుడు వేలి గాయం కారణంగా.. టీమిండియా కు దూరమయ్యాడు సంజు. ఆ తర్వాత శస్ట్ర చికిత్స చేయించుకున్నాడు.. అయితే ఆ గాయం నుంచి కోల్కున్న రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ( Sanju Samson )…బరిలోకి దిగి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈనెల 23వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
Also Read: Most Sixes IPL: ఎక్కువ సిక్సులు కొట్టిన వీరులు…గేల్ ను టచ్ కూడా చేయలేరు ?
ఈ నేపథ్యంలో… భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… పది జట్లు రెడీ అవుతున్నాయి. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టి… దూకుడు పైన ఉన్నాయి 10 జట్లు. మొట్టమొదటగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో… కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య ఫైట్ ఉండనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. కోల్కతాలోని… ఈడెన్ గార్డెన్స్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మార్చి 23వ తేదీన మ్యాచ్ ఉంది. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ నేపథ్యంలో… ఫైనల్ వరకు వచ్చి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా ఓడిపోయింది. దీంతో ఫైనల్ మ్యాచ్లో గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది.