BigTV English

Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి ఘోర ప్రమాదం.. రెండు కార్లు తుక్కు తుక్కు !

Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి ఘోర ప్రమాదం.. రెండు కార్లు తుక్కు తుక్కు !

Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కి ( Sourav Ganguly ) ఊహించని షాక్ తగిలింది. తాజాగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కారు ప్రమాదానికి గురైంది. సౌరవ్ గంగూలీ… ప్రయాణిస్తున్న కారుకు.. ముందుగా వెళ్తున్న లారీ డ్రైవర్.. బ్రేక్ వేయడంతో.. ప్రమాదం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పశ్చిమ బెంగాల్ లోని బుద్ద్వాన్ విశ్వవిద్యాలయం లో ఓ కార్యక్రమానికి.. హాజరయ్యేందుకు సౌరవ్ గంగూలీ.. కారులో ( Sourav Ganguly Car) ప్రయాణించారు. అయితే… సౌరవ్ గంగూలీ కారులో వెళుతున్న సమయంలోనే… ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు.


Also Read: IND vs BAN: గిల్ డేంజర్ సెంచరీ.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ భోణీ..!

సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారుకు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడం జరిగింది. దీంతో.. సౌరవ్ గంగూలీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసేసారు. ఈ క్రమంలో గంగోలి కాన్వాయ్ అలాగే మరో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ ఏర్పడింది. దాదాపు రెండు కార్లు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో సౌరవ్ గంగూలీ, ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు… కేసు నమోదు చేసుకున్నారు. అక్కడి నుంచి సౌరవ్ గంగూలీ.. అదే కారులో ప్రయాణించడం జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 

ఇక సౌరవ్ గంగూలీ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీస్తున్నారు అభిమానులు. అటు సౌరవ్ గంగూలీ కుటుంబం కూడా… వెంటనే గంగులి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. వారందరికీ సౌరవ్ గంగూలీ నచ్చ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాను బాగానే ఉన్నానని.. ఎవరు టెన్షన్ పడకూడదని కోరారట. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా.. రిలాక్స్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. 1989 ఆ కాలంలో… టీమిండియా జట్టులోకి వచ్చిన అతను… 2008 లోపు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన 2007 సంవత్సరంలో చివరి వన్డే ఆడగా… 2008 సంవత్సరంలో చివరి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడాడు. అలాగే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ గా కూడా గంగూలీ పని చేశారు. 2019 నుంచి 2022 వరకు ఆయన సేవలు అందించడం జరిగింది. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా అనేక సేవలు అందించాడు సౌరవ్ గంగూలీ. తన క్రికెట్ చరిత్రలో.. క్రికెటర్ గా, అదే సమయంలో కెప్టెన్ గా కూడా రానించాడు సౌరవ్ గంగూలీ. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత.. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ గా కూడా కొనసాగుతున్నారు గంగూలీ.

Also Read: Champions Trophy 2025: టీమ్ ఇండియా మ్యాచ్.. పాకిస్తాన్ కి బిగ్ షాక్

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×