BigTV English

Sania Mirza: సానియా మీర్జా కొత్త ప్రయాణం..ఇక రచ్చ రచ్చే!

Sania Mirza: సానియా మీర్జా కొత్త ప్రయాణం..ఇక రచ్చ రచ్చే!
  • సీసా స్పేసెస్‌తో సానియా మీర్జా భాగ‌స్వామ్యం
  • చిన్నారుల ఆరోగ్యం, ఫిట్నెస్‌పై ప్ర‌త్యేక దృష్టి

Sania Mirza: ఇప్పుడు పిల్లలంతా కంప్యూటర్లకు, ఐపాడ్ కు అతుక్కుపోతున్నారు. అన్నం తినే సమయంలో ఐపాడ్ చేతిలో లేకుంటే వారికి ముద్ద దిగడం లేదు. ఒక తల్లిగా నేను కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాను. అయితే పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం, మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన వాతావరణంలో చదువు అనేది చాలా ముఖ్యం.  శ్రీజ కొణిదెల, స్వాతి గునుపాటి ఏర్పాటు చేసిన సీ సా స్పేసెస్ లో ఇప్పుడు నేను భాగస్వామురాలిని అవుతున్నాను.


Also Read: WTC Cycle 2025-27 Schedule: WTC 2025-27లో టీమిండియా షెడ్యూల్ వచ్చేసింది ?

చిన్నారులకు ఒక సరైన దిశా నిర్దేశం చూపే అద్భుతమైన ప్రాంతం ఇది అని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని సానియా మీర్జా ( Sania Mirza ) అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 ఏడాది కిందట సినీ నటుడు చిరంజీవి కుమార్తె శ్రీజ కొనిదెల, సహా భాగస్వామి స్వాతి గునుపాటి ఆధ్వర్యంలో సీ సా స్పేసెస్ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంవత్సరం నుంచి 12 ఏళ్ల చిన్నారుల వరకు వారి ఆరోగ్యం, చదువు, నడవడికలపై దృష్టి పెట్టేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.


 

ఇందులో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఇక్కడికి వచ్చే చిన్నారులకు ఫిట్నెస్, ఆరోగ్యం విషయంలో తాను సీ సా స్పేసెస్ తో భాగస్వామురాలినై పిల్లలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు సానియా మీర్జా ( Sania Mirza ) తెలిపారు. ఒక ఆటలే కాకుండా ఆరోగ్యానికి కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఇక్కడ ఉండేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. హైదరాబాద్ ఒక టాడ్లర్ సిటీగా మారనుందని అన్నారు. 2025లో తాను తీసుకున్న నిర్ణయాలలో ఇది ఒకటి అని, కొత్తగా మార్పులు లేవని ప్రతి ఒక్కరు ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేశారు.

Also Read: Chahal wife with iyer: చాహల్ తో విడాకులు.. అయ్యర్ తో ధనశ్రీ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!

స్వాతి గునుపాటి సీ సా ఫౌండర్ మాట్లాడుతూ…. పేరెంట్స్ కోసం కెఫే ఏర్పాటు చేసాం. ఇక్కడ ఏడాది వయసున్న పిల్లల నుంచి టీనేజర్ల వరకు ఇక్కడ అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు. శ్రీజ కొనిదెల కో-ఫౌండర్ మాట్లడుతూ….సానియా మీర్జా పిల్లలను తన క్రీడల ద్వారా మరింత ప్రభావితం చేయనుందన్నారు. ఈ కేంద్రాన్ని ఒక బిజినెస్ ల కాకుండా చిన్నారులకు ఉపయోగపడేలా ఇక్కడ తీర్చిదిద్దామన్నారు.

 

తల్లిదండ్రులు పిల్లలకు రోల్ మోడల్ అని అన్నారు. పిల్లలను తీసుకొని ఇక్కడికి వస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. తల్లిదండ్రులు ఇక్కడ తమ పని తాము చేసుకునేలా ఏర్పాటు చేశామని అన్నారు. త్వరలోనే దీనిని హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా..ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని సానియా మీర్జా ( Sania Mirza ) ఇప్పటికే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్న ఆమె… కెరీర్‌ పై దృష్టి పెట్టారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×