Virender Sehwag : టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆసియా కప్ 2025 నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై ఉత్కంఠ పెంచేందుకు సోనీ స్పోర్ట్స్ ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. ఇందులో సెహ్వాగ్ నటించాడు. ప్రస్తుతం ఇరుదేశాల ఉప్పు నిప్పులా ఉన్న సమయంలో దాయాదుల మ్యాచ్ గురించి ప్రచారం చేయడం తగదని పలువురు సెహ్వాన్ ని విమర్శిస్తున్నారు. అసలు సెహ్వాగ్ ఏమన్నాడంటే..? త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ లో సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టే టైటిల్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు సెహ్వాగ్. ప్రస్తుతం టోర్నీలో పాల్గొంటున్న జట్లలో మనదే అత్యుత్తమ జట్టు అని.. కప్ ను నిలబెట్టుకోవడం ఖాయమని జోస్యం చెప్పాడు సెహ్వాగ్.
Also Read : AB de Villiers : RCB కోసం రంగంలోకి ఏబీ డివిలియర్స్.. సరికొత్త రోల్ ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కు పండగే
టీమిండియాదే విజయం : సెహ్వాగ్
ఆసియా కప్ అధికారిక బ్రాడ్ కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్స్ తో ప్రత్యేకంగా మాట్లాడాడు సెహ్వాగ్. భారత జట్టు సత్తా పై పూర్తి విశ్వాసం కనబరిచాడు. ” మనం ప్రపంచ ఛాంపియన్లం. ఇటీవలే టీ-20 వరల్డ్ కప్ కూడా గెలిచాం. కాబట్టి ఆసియా కప్ లో మనమే అత్యుత్తమ జట్టు అని నేను కచ్చితంగా చెప్పగను. ఈసారి కూడా టైటిల్ మనమే గెలుస్తామని ఆశిస్తున్నాను ” అని పేర్కొన్నాడు సెహ్వాగ్. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ని సెహ్వాగ్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. “మనకు చాలా మంచి జట్టు ఉంది. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపిస్తున్నాడు. అతను టీ-20 ఫార్మాట్ లో ఓ టాప్ ప్లేయర్. గతంలో సూర్య కెప్టెన్సీలో మనం పలు టీ-20 మ్యాచ్ లు గెలిచాం. అతనినాయకత్వంలో ఈసారి కూడా అద్భుతంగా రాణిస్తామని ఆసియా కప్ గెలుస్తామని నమ్ముతున్నట్టు వివరించారు సెహ్వాగ్.
ఆసియా కప్ అద్భుతమైన అవకాశం..
2026లో భారత్, శ్రీలంక వేదికగా జరుగనున్న టీ-20 ప్రపంచ కప్ సన్నద్ధమయ్యేందుకు ఈ ఆసియా కప్ ఓ గొప్ప అవకాశమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ” ఈ టోర్నీ ద్వారా కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు. ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేసుకోవచ్చు. మన బలాన్ని పరీక్షించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదని తెలిపారు. జట్టు ఎంపిక పై వస్తున్న విమర్శలను పక్కన పెడుతూ సెలెక్టర్లు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 09 నుంచి 28 వరకు ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీ టీ-20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. గ్రూపు-ఏ లో ఉన్న భారత్ సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో, సెప్టెంబర్ 19న ఒమన్ తో తలపడనుంది. ఆసియా కప్ లో పాకిస్తాన్ జరిగే మ్యాచ్ పై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ పలువురు క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని పేర్కొంటున్నారు.