IND VS WI Toss Controversy: టీమిండియా వర్సెస్ విండీస్ ( IND vs WI) మధ్య జరుగుతోన్న నాలుగో టీ20 టాస్ సందర్బంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టాస్ పడిన వెంటనే రవిశాస్త్రి, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అవమానించాడు. టీమిండియా టాస్ గెలిచిందని రవిశాస్త్రి ప్రకటించగానే డౌట్ వచ్చి, ఆ కాయిన్ ను షాయ్ హోప్ చెక్ చేశాడు. కాయిన్ చూసిన తర్వాతే కూల్ అయిన షాయ్ హోప్ ముందు బ్యాటింగ్ చేసేందుకు అంగీకరించాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
టీమిండియా వర్సెస్ విండీస్ ( IND vs WI) జట్ల మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ( Rajiv Gandhi International Stadium, Hyderabad) 4వ టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియానే టాస్ గెలిచి, మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే, టాస్ వేసే క్రమంలో హోస్ట్ గా రవిశాస్త్రి వ్యవహరించాడు. శ్రేయస్ అయ్యర్, విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఇద్దరూ టాస్ కోసం వచ్చారు. ఈ తరుణంలోనే శ్రేయస్ అయ్యర్ కాయిన్ తీసుకుని టాస్ వేశాడు. అదే సమయంలో విండీస్ సారధి హోప్ తనది హెడ్ అని చెప్పేశాడు. కానీ టేయిల్స్ పడింది. దీంతో వెంటనే తమది బౌలింగ్ అంటూ శ్రేయస్ అయ్యర్ ఒక్క సెకండ్ ఆలోచించకుండా బౌలింగ్ అనేశాడు. దీంతో అనుమానం వచ్చిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కాయిన్ చెక్ చేశాడు. తీరా కాయిన్ చూస్తే, టీమిండియానే టాస్ గెలిచినట్టు తేలడంతో రిలాక్స్ అయ్యాడు.
అక్కడే ఉన్న రవిశాస్త్రి, శ్రేయస్ అయ్యర్… ఈ దరిద్రుడు మనల్నే అనుమానిస్తున్నట్టుగా ఉందన్నట్టుగా లోలోపలే అనుకున్నారు. ఈ వెధవలకు ఎప్పుడూ డౌటే అంటూ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే, దీనిపై పాకిస్తాన్ మాజీలు వెంటనే రియాక్ట్ అయ్యారు. టాస్ సమయంలో ఫిక్సింగ్ జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ( Shai Hope) సరిగ్గా గమనించలేదని, అందుకే టీమిండియా టాస్ గెలిచిందని ఆరోపణలు చేశారు. దీనిపై వెంటనే ఐసీసీ విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా, బీసీసీఐ కుట్రలు పన్ని విండీస్ పై సిరీస్ గెలిచే ప్లాన్ వేశాయని ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ హైదరాబాద్ మ్యాచ్ టీమిండియా గెలిస్తే, ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకోనుంది. ఒకవేళ విండీస్ గెలిస్తే, ఐదో టీ20 మ్యాచ్ పోటాపోటీగా సాగనుంది.