E-Paper
Advertisement

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!
Advertisement

Neha Sharma:నేహా శర్మ..చిరు తనయుడు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందుకనో తెలుగు తెరపై వరుస సినిమాలు చేయలేకపోయింది. అయినప్పటికీ బాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే సినిమాలలో స్పీడ్ తగ్గించినప్పటికీ తగ్గించినప్పటికీ నెట్టింట వరుస పోస్ట్ లతో అభిమానులని అలరిస్తూనే ఉంటుంది.

ఇక ఈ క్రమంలోనే మరోసారి తన అందమైన ఫోటోతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తన ఫొటోషూట్లతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ, ఈసారి మాత్రం ఒక పోయెటిక్ క్యాప్షన్ పెట్టి ఫ్యాన్స్ ని ఫిదా చేసేసింది.

Advertisement

“Shaam ke saaye baalishton se naape hain, chaand ne kitni der laga di aane mein” అంటూ తన పోస్ట్ కి క్యాప్షన్ పెట్టడంతో ఒక్కసారిగా కామెంట్ల వర్షం కురిపించేశారు ఫాలోవర్స్. ఎప్పుడూ గ్లామరస్ ఫోటోలతో కనిపించే నేహా, ఈసారి తన లుక్‌తో పాటు క్యాప్షన్‌తో ఆకట్టుకోవడం ఇక్కడ విశేషం.

ఇక ఈ ఫోటోలో నేహా శర్మ ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ డిజైన్‌తో కూడిన ట్రెడిషనల్ డ్రెస్ లో అందాలని ఒలకబోసింది. ముఖ్యంగా డ్రెస్ పై ఉన్న బంగారు రంగు వర్క్, చెవులకు ధరించిన ఆభరణాలు, చిన్న బిందీ, నోస్ పిన్ ఆమె లుక్‌ ని మరింత క్లాసీగా మార్చిందనే చెప్పాలి. ఇక చేతికి వాచ్ ,హెయిర్ స్టైల్, మేకప్ వంటివి అన్నీ ఈ చిరుత బ్యూటీకి సరిగ్గా నప్పాయనడంలో సందేహం లేదు .

Advertisement

ఇక నేహా శర్మ కెరీర్ విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ సినిమాతో తెలుగు తెరపై మొదటి సారిగా కనిపించింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలోనూ నటించి తెలుగు తెరపై మెరిసిన ఈ భామ ఆ తర్వాత టాలీవుడ్ కి టాటా చెప్పేసి బాలీవుడ్ లో పాగా వేసేసింది.

అక్కడ ‘క్రూక్’, ‘తేరీ మేరీ కహానీ’, ‘క్యా సూపర్ కూల్ హై హమ్’, ‘జయంతాభాయ్ కి లవ్ స్టోరీ’, ‘యంగిస్తాన్’ వంటి చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ముఖ్యంగా రొమాంటిక్ కథలతో పాటు కామెడీ, డ్రామా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

ఇక ‘తుమ్ బిన్ 2’లో ఆమె పోషించిన పాత్ర అయితే ఆమె కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అని చెప్పాలి. ఇక ‘ముబారకన్’ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించి సందడి చేసింది నేహ.అన్నింటి కన్నా ముఖ్యంగా అజయ్ దేవగణ్ లీడ్ రోల్ లో నటించిన ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ సినిమాలో కమలా దేవి పాత్రలో నేహా శర్మ కనిపించి మరింత క్రేజ్ ని మూట గట్టుకుంది.
చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటి అనడంలో సందేహం లేదు.

ALSO READ :సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

ఇక ఈ మధ్య ‘జోగీరా సారా రా రా’, ‘బ్యాడ్ న్యూజ్’ వంటి డిజిటల్ కంటెంట్ ద్వారా కూడా ఆడియన్స్ ని పలకరిస్తూనే ఉంది. చూడాలి మరి ఒకవైపు వరుస సినిమాలు ,మరో వైపు గ్లామర్ ఫోటో షూట్స్ తో అభిమానులని ఫిదా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వచ్చే రోజుల్లో ఎలాంటి సినిమాలతో పలకరించనుందో !

Tags

Related News

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

Big Stories

Advertisement
×