Shai Hope On Gambhir Birthday: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ (India vs West Indies) మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా (Rajiv Gandhi International Stadium, Hyderabad) జరిగిన మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ సేనకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. అయితే నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత గౌతమ్ గంభీర్ కు విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ షేక్ హ్యాండ్ ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అయింది. ఈ క్రమంలో కొంత మంది దారుణంగా ఈ ఫోటోపై ట్రోల్స్ చేస్తున్నారు.
మహేంద్ర సింగ్ ధోని అభిమానిగా గౌతమ్ గంభీర్ కు పుట్టిన రోజు సంబరం లేకుండా షాయ్ హోప్ చేశాడని… అందుకే కావాలని షేక్ హ్యాండ్ ఇచ్చి విషెస్ చెప్పినట్లు సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు. గతంలోనే తాను ధోని ఫ్యాన్ అని షాయ్ హోప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అతన్ని చూసే, కెప్టెన్ స్థాయికి ఎదిగినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే టీమిండియాను ఓడించి గంభీర్ పై పగ తీర్చుకున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన 45వ ఏటలోకి అడుగుపెట్టాడు. అయితే నిన్న ఉప్పల్ వేదికగా వెస్టిండీస్ తో మ్యాచ్ జరగగా… టీమిండియా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ లో బ్యాటర్లు చేతులెత్తేయడంతో టీమిండియా ఓడిపోయింది. మ్యాచ్ గెలిస్తే గౌతమ్ గంభీర్ పుట్టిన రోజు వేడుకలను చాలా గ్రాండ్ గా చేయాలని అందరూ అనుకున్నారు. కానీ మ్యాచ్ ఓడిపోవడంతో డీలా పడిపోయారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గౌతమ్ గంభీర్ కు సంబరం లేకుండా చేయాలని టీమిండియా ఆటగాళ్లు కావాలనే ఓడిపోయినట్టు కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. దానికి తోడు పుండు మీద కారం చల్లినట్టు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్… మ్యాచ్ గెలిచిన తర్వాత గంభీర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి పుట్టినరోజు వేడుకలు చెప్పాడని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 247 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 223 పరుగులకు కుప్పకూలింది టీమిండియా. దీంతో 24 పరుగుల తేడాతో ఓడిపోయింది.