E-Paper
Advertisement

కొంప‌ముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్…ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి

కొంప‌ముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్…ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి
Advertisement

IND VS WI Uppal Match:  హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20 సందర్భంగా టీమిండియాకు ఘోర ఓటమి ఎదురైంది. వెస్టిండీస్ చేతిలో ఏకంగా 24 పరుగుల తేడాతో ఓడిపోయింది టీమిండియా. వెస్టిండీస్ విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఈ క్రమంలోనే టీమిండియాకు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఇందులో గెలిచిన వెస్టిండీస్…2-2 తేడాతో సిరీస్ ను మళ్లీ స‌మం చేసింది.

అయితే ఈ రెండు జ‌ట్ల మధ్య ఈ నెల 17వ తేదీన చివరి టీ20 బెంగళూరు వేదికగా జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకు టైటిల్ దక్కనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే గౌతమ్ గంభీర్ పుట్టిన రోజు వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుకునేందుకు అత‌ని ఫ్యాన్స్ దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు చేశార‌ట‌. కానీ చివరి క్షణంలో టీమిండియా ఓడిపోవడంతో గంభీర్ తో పాటు అభిమానులు డీలా పడిపోయినట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది.

ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి

Advertisement

టీమిండియా వర్సెస్ విండీస్ ( IND vs WI) మధ్య జరిగిన హైదరాబాద్ లోని ఉప్పల్ ( Rajiv Gandhi International Stadium, Hyderabad)  మ్యాచ్ లో  శ్రేయస్ అయ్యరే టాస్ గెలిచాడు. ఈ తరుణంలోనే విండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన షాయ్ హోప్ సేన, కేవలం 3 వికెట్లు నష్టపోయి ఏకంగా 247 పరుగులు సాధించింది. ఎప్పటిలాగే టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలం కావడంతో షాయ్ హోప్ గ్యాంగ్ రెచ్చిపోయింది. 50 బంతుల్లోనే షాయ్ హోప్ 102 పరుగులు సాధించాడు. ఇందులో 9 సిక్సర్లతో పాటు 4 బౌండరీలు ఉన్నాయి.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

Advertisement

అటు మరో ఓపెనర్ అండ్రూ 21 పరుగులు చేయగా, షిమ్రాన్ హెట్‌మైర్ 33 పరుగులు, పోవెల్ 24 పరుగులు చేశారు. రూథర్ ఫోర్డ్ 49 పరుగులతో ఇరగదీశాడు. దీంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. అయితే విండీస్ విధించిన 248 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేదించే క్ర‌మంలో 19.3 ఓవ‌ర్లు ఆడిన టీమిండియా 223 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. సంజు శాంస‌న్‌, తిల‌క్ వ‌ర్మ‌, నితీష్ రాణించిన‌ప్ప‌టికీ మిగిలిన బ్యాట‌ర్లు తేలిపోవ‌డంతో టీమిండియాకు ఓట‌మి ఎదురైంది.

టీమిండియా కొంపముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్

ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 సందర్భంగా టీమిండియా ఆల్ రౌండ‌ర్ నమన్ ధీర్ (0) వివాదాస్పదంగా స్టంప్ ఔట్ అయ్యాడు. ఇండియా చేజింగ్ చేస్తున్న సమయంలో 12వ ఓవర్ విండీస్ ప్లేయ‌ర్ మోటీ వేసాడు. ఈ క్రమంలో ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేసిన నమన్ ధీర్ విఫలమయ్యాడు. దీంతో బంతి అతడిని బీట్ చేసింది. ఇక వికెట్ కీపర్ షాయ్ హోప్ క్షణాల్లోనే బెల్స్ ఎగరగొట్టేశాడు. అయితే స్టంప్ పడే సమయంలో క్రీజులో న‌మ‌న్ ధీర్ కాలు పెట్టాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు నమన్ ధీర్ ఔటే కాదని ఇండియన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతని వికెట్ పడకుండా ఉండి ఉంటే టీమ్ ఇండియా గెలిచేదని అంటున్నారు.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

 

Related News

టాస్‌లోనూ కుట్రలు…రవిశాస్త్రి, శ్రేయస్‌ను అవమానించిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

Big Stories

Advertisement
×