E-Paper
Advertisement

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి..  వీడియో వైరల్!
Advertisement

Laya Bathukamma:తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దీంతో వరుసగా సెలబ్రిటీలు బతుకమ్మ పాటలు చేస్తూ నెట్ ఇంట్లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మంగ్లీ మధుప్రియ, కనకవ్వ వంటి ఫోక్ సింగర్స్ తమతమ బతుకమ్మ పాటల్ని నెట్టింట్లో వదలగా, తాజాగా నేను ఇందులో భాగమవుతానంటూ నటి లయ బతుకమ్మ పాటను వదిలింది.

సోషల్ మీడియాలో వైరల్

Advertisement

ఇక వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి Bathukamma — A Celebration of Flowers, Femininity & Telangana’s Beautiful Heritage!’ అంటూ బతుకమ్మ గొప్పతనాన్ని తన పోస్ట్ లో చెప్పుకొచ్చింది నటి లయ.

దీంతో పూలతో జరుపుకునే ఈ పండుగలో తెలంగాణ సంప్రదాయాలు ఎంత ముఖ్యమో ఆమె పోస్ట్ చూస్తేనే అర్థమవుతుంది .ముఖ్యంగా ఇందుకోసం లయ మేకోవర్ అయిన లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. అయితే ఇందులో కేవలం తన గురించే కాకుండా ఈ వీడియోని షూట్ చేసిన కెమెరా ఉమెన్ గురించి కూడా లయ స్పెషల్ గా ప్రస్తావించడం విశేషం.

Advertisement

ఆమె క్రియేటివిటీ అద్భుతం

ప్రతి ఫ్రేమ్ అందంగా చూపించడానికి కెమెరా ఉమెన్ సంజన పడిన కష్టం మామూలుది కాదని ఆమె క్రియేటివిటీ అద్భుతం అని ఆకాశానికి ఎత్తేసింది. అంతేకాదు ఈ షూటింగ్లో పాల్గొన్న టీం ని కూడా మెచ్చుకుంది లయ.ఒక వీడియో అందంగా రావాలంటే తెరపై కనిపించే వ్యక్తులతో పాటు, తెర వెనుక పనిచేసే వారి కష్టం కూడా ఎంతో ఉంటుందని చెప్పుకొచ్చింది.

లయ గురించి చెప్పాలంటే ఆమె తెలుగులో ఎంత మంచి సినిమాలు చేసిందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆమె చేసిన స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ వంటి సినిమాల తో ఆడియన్స్ బాగా దగ్గర అయ్యింది. ముఖ్యంగా ప్రేమించు సినిమాలో గుడ్డి అమ్మాయిగా ఆమె చేసిన నటనకి ఏకంగా నంది నడుచుకుంటూ వచ్చింది.

ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న తాజాగా వెబ్ సిరీస్ లు , సినిమాలతో బిజీగా అవుతుంది. ముఖ్యంగా శివాజీతో కలిసి చేసిన సాంప్రదాయిని , సుప్పిని సుద్ధపూసిని సిరీస్ మంచి పేరు తెచ్చుకుంది .

ఎంతమంది సెలబ్రిటీస్  బతుకమ్మ పాటల్ని చేస్తారో!

ఇప్పుడు బతుకమ్మ పాట వదలడంతో మరో సారి హైలైట్ అయింది. ఇక బతుకమ్మ పండుగ సమయంలో ఈ పాటలకు వీడియోలకి ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక ఈ పాటలే గ్రామ గ్రామాన మారు మ్రోగిపోతుంటాయి కూడా. మొత్తానికి లయ చేసిన బతుకమ్మ వీడియోలో బ్యూటీతో పాటు తెలంగాణ కల్చర్ కూడా కనిపించడం విశేషం. చూడాలి లయ బాటలోనే ఇంకా ఎంతమంది సెలబ్రిటీస్ ఇలా బతుకమ్మ పాటల్ని చేస్తారో!

Tags

Related News

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×