BigTV English

Shikhar Dhawan: కుంభమేళాలో శిఖర్ ధావన్.. ఆ అందాల తారతో ఏకంగా?

Shikhar Dhawan: కుంభమేళాలో శిఖర్ ధావన్.. ఆ అందాల తారతో ఏకంగా?

Shikhar Dhawan: భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్.. ప్రస్తుతం లైఫ్ ని సింగిల్ గా గడిపేస్తున్నాడు. ఎందుకంటే అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కి చెందిన ఆయేషా ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆస్ట్రేలియాకి వెళ్ళింది.


Also Read: Michael Vaughan: టీమిండియాకు డేంజర్‌ బెల్స్‌..3-2 గెలుస్తామని మైఖేల్‌ వాన్‌ హెచ్చరికలు ?

మెల్ బోర్న్ లో కిక్ బాక్సర్ గా ఎదిగిన ఆయేషా.. అక్కడ ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే వీరి వివాహ బంధానికి తెరపడింది. దీంతో స్నేహితుల ద్వారా పరిచయమైన శిఖర్ ధావన్ ని ఆయేషా రెండో పెళ్లి చేసుకుంది. 2012 వ సంవత్సరం అక్టోబర్ లో ధావన్ – ఆయేషా వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య 10 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ ఆమెని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు ధావన్. అంతేకాదు అప్పటికే ఆయేషాకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయినప్పటికీ ధావన్ తన కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నాడు.


ఇక ఈ జంటకి 2014లో ఓరావర్ జన్మించాడు. ఆ తర్వాత కొంతకాలం సవ్యంగానే సాగిన వీరి దంపత్య జీవితంలో మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో కొంత కాలంపాటు వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో 2021 వ సంవత్సరంలో విడాకులు తీసుకుంటున్నానని ఆయేషా సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది. దీంతో క్రీడాభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కాగా 2023 అక్టోబర్ నెలలో ఈ జంటకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వీరి 11 ఏళ్ల వివాహ బంధం రద్దయింది.

వీరిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని న్యాయస్థానం తెలిపింది. అతని భార్య ఆయేషా ముఖర్జీ మానసికంగా వేధించిందన్న ధావన్ వాదనలను న్యాయస్థానం సమర్ధించింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం ఏంటంటే.. వివాహానికి ముందు ధావన్ తో భారత్ లో కలిసి నివసించేందుకు ఆయేషా అంగీకరించింది. ఆమెకు అప్పటికే మొదటి వివాహం ద్వారా ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కానీ ధావన్ కి ఇచ్చిన మాట ప్రకారం భారత్ లో ఎక్కువ కాలం నివసించలేదు. ధావన్ – ఆయేషాకు జన్మించిన ఓరావర్ ని కూడా ఆస్ట్రేలియాలోని పెంచింది.

ఇందులో ధావన్ తప్పు లేనప్పటికీ అతడి కుమారుడిని అతడికి దూరం చేసి మానసిక ఆవేదనకు గురిచేసింది. అంతేకాదు ధావన్ తన సొంత డబ్బులతో కొనుగోలు చేసిన ఆస్తులలో ఒకదానిని తన పేరిట రాయాలని ఆయేషా ఒత్తిడి చేసింది. మిగిలిన రెండు ఆస్తులలో తనని ఉమ్మడి యాజమానిగా పేర్కొనాలని ధావన్ ని వేధించింది. దీనికి అతడు ఒప్పుకోకపోవడంతో అతడి పరువుకు భంగం కలిగించేలా తోటి క్రికెటర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీ లకు సందేశాలు పంపించిందని న్యాయస్థానం పేర్కొంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.

ఈ క్రమంలో ధావన్ గత కొంతకాలంగా సింగిల్ గా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ధావన్ రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ధావన్ కి ఓ స్టార్ హీరోయిన్ తో పెళ్లి అయిపోయిందంటూ ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను నెటిజెన్లు షేర్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు హుమా ఖురేషి. ఈమె గురించి తెలియని వారు ఉండరనే చెప్పాలి. ఎందుకంటే ఈమె హిందీ తో పాటు మరాఠీ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లలో ఎక్కువగా కనిపిస్తుంది.

Also Read: ICC – BCCI: జెర్సీ వివాదం…BCCIకి ICC బిగ్‌ షాక్‌..రూల్స్‌ బ్రేక్‌ చేస్తే చర్యలు తప్పవు ?

గతంలో కూడా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోల గురించి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శిఖర్ ధావన్ – హుమా ఖురేషి ఫోటోలు ఫేక్ అని తేలిపోయింది. వీరి ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల ఈ టెక్నాలజీని తప్పుడు పనులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Related News

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Big Stories

×