Shivashankara : సాధారణంగా క్రికెట్‌లో రకరకాల వింత సంఘటనలు జరుగుతుంటాయి. మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా గల్లీ క్రికెట్ లో అయిన, స్టేట్ లేవల్ క్రికెట్ అయినా, రంజీ ట్రోఫీ అయినా, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అయినా.. ఏదైనా సరే చిత్ర, విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటుండటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. గల్లీ క్రికెట్ లో ఈ మధ్య కాలంలో బౌలర్లు రివర్స్ బంతి వేసి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడం, లేదా బ్యాట్స్‌మెన్లు రివర్స్‌లో బ్యాటింగ్ చేసి సిక్సులు, ఫోర్లు కొట్టడం వంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, ఇండియాలో గల్లీ క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పంట పొలాల వద్ద, గల్లీలలో, చిన్న చిన్న మైదానాలలో, పాఠశాలలు, కళాశాలల్లో కూడా క్రికెట్ ఆడుతుంటారు.
Also Read : Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్
శివ శంకర బ్యాటింగ్ ఫిదా అవ్వాల్సిందే..
తాజాగా ఇండియాస్ డిఫరెంట్లీ ఎబుల్డ్ క్రికెటర్ శివశంకర బ్యాటింగ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. సాధారణంగా ఏ క్రికెటర్ అయినా రెండు చేతులతో బ్యాటింగ్ చేస్తుంటారు. కానీ ఈ క్రికెటర్ మాత్రం సింగిల్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేస్తూ ఔరా అనిపించాడు. సింగిల్ హ్యాండ్ తో ఫోర్, సిక్స్ లు బాదుతాడు. అతని ఆట చూసిన వారెవ్వరూ శభాష్ అనకుండా ఉండరు. ఇప్పటి వరకు ఇతను 24వేల పరుగులు చేశాడు. అందులో 29 సెంచరీలు కూడా ఉండటం గమనార్హం. అతను లోకల్ బెంగళూరు సర్క్యూట్స్ తరపున ఎక్కువగా ఆడుతాడు. ముఖ్యంగా ఒక భారతీయ వికలాంగ క్రికెటర్ అయిన శివశంకర్ స్థానిక బెంగళూరు సర్క్యూట్ లో ఆడుతూ తన క్రికెట్ కెరీర్ లో 24వేల పరుగులు సాధించడంతో ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. రెండు చేతులు ఉండి కూడా కొంత మంది విఫలం చెందుతుంటే సింగిల్ హ్యాండ్ గణేష్ మాదిరిగా ఇతను ఇంత అద్భుతంగా క్రికెట్ ఆడటం గొప్ప విషయం అనే చెప్పాలి.
వికలాంగ క్రికెటర్ రికార్డు
ఈ వికలాంగ క్రికెటర్ శివశంకర రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఇక ఇలా టాలెంట్ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వారిలో కొందరూ వెలుగులోకి రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా మారు మూరు ప్రాంతాల్లో క్రీడల్లో రాణించే వారు అధిక సంఖ్యలో ఉంటారు. కానీ వారు సరిగ్గా వెలుగులోకి వస్తే.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇరుగదీస్తారు. క్రికెట్ లో ఇలాంటి రికార్డులు నమోదు కావడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ఇటీవల పంజాబ్ లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్ లో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఏ చేతితో బౌలింగ్ చేస్తున్నాడో అసలు బ్యాటర్లకు అర్థం కాలేదు. ఈ తికమక బౌలింగ్ బంతిని అంచనా వేయలేక బ్యాటర్లు పెవిలియన్ కి చేరారు. దీంతో ఆ యువ బౌలర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఎడమ చేతితో బాల్ అందుకున్నటువంటి ఆ బౌలర్.. చేతులను మార్చి వెనక్కి, ముందుకు తిప్పుతూ.. ఓ చేతి నుంచి మరో చేతికి బాల్ మార్చుతూ చివరికీ కుడి చేతితో బౌలింగ్ చేశాడు. ఇదంతా గమనించిన బ్యాటర్ కి ఏం అర్థం కాకపోవడం.. క్లీన్ బౌల్డ్ కావడం విశేషం.
India's 🇮🇳 Differently Abled Cricketer Shivashankara Batting Video 👏🏻
– He has scored over 24,000 runs and 29 centuries in his career, playing in local Bangalore circuits 🥶
Truly Inspirational 🙌🏻 pic.twitter.com/6Q5jGnhcur
— Richard Kettleborough (@RichKettle07) August 6, 2025