E-Paper
Advertisement

Shoaib Akhtar: అల్లా మీద ఒట్టు…ఇక జ‌న్మ‌లో పాకిస్తాన్ క్రికెట్ అస్స‌లు చూడ‌ను

Shoaib Akhtar: అల్లా మీద ఒట్టు…ఇక జ‌న్మ‌లో పాకిస్తాన్ క్రికెట్ అస్స‌లు చూడ‌ను
Advertisement

Shoaib Akhtar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య సైలెంట్ గా టెస్ట్ సిరీస్ ముగిసిపోయింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తుంది అనుకున్న పాకిస్తాన్, దారుణంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ అయింది. రెండు టెస్టుల్లో కూడా చిత్తు చిత్తుగా పాకిస్తాన్ జట్టును ఓడించిన బంగ్లాదేశ్.. స్వదేశంలో తొలిసారిగా టెస్టు సిరీస్ గెలుచుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆట తీరుపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) చాలా సీరియస్ అయ్యారు. వీళ్ళ ప్రదర్శన చూస్తుంటే, తనకు అసహ్యం వేస్తోందని ఆగ్రహించారు. తనకు డబ్బులు వస్తున్నాయన్న ఒక్క కారణంతో పాకిస్తాన్ క్రికెట్ చూస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. అల్లా మీద ఒట్టు… ఇక జన్మలో పాకిస్తాన్ ఆడే ఏ మ్యాచ్ చూడబోనని శపథం చేశారు. దీంతో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

అల్లా మీద ఒట్టు…ఇక జ‌న్మ‌లో పాకిస్తాన్ క్రికెట్ అస్స‌లు చూడ‌ను

Advertisement

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) హాట్ కామెంట్స్ చేశారు. తనకు డబ్బులు వస్తున్నాయన్న ఒక్క కారణంతో… పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ చూస్తున్నాను… లేకపోతే వాళ్ళని అసలు పట్టించుకునే వాడిని కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకపైన అసలు పాకిస్తాన్ మ్యాచ్ లు చూడబోనని వ్యాఖ్యానించారు. ఒక్కడికి సరిగ్గా ఆడడం చేతకావడంలేదని మండిపడ్డారు. షాన్ మసూద్ ( Shan Masood) ఆటగాడికి ఎక్కువ.. కెప్టెన్ కు తక్కువ అన్నట్లుగా ఉన్నాడని సీరియస్ అయ్యారు. అతన్ని కెప్టెన్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ముందుగా తన్నాలి అంటూ మండిపడ్డారు. ఇలా అయితే పాకిస్తాన్ క్రికెట్ భూస్థాపితం కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. తనకే పాకిస్తాన్ క్రికెట్ నచ్చడం లేదంటే… అభిమానులు అస్సలు పట్టించుకోరని వార్నింగ్ ఇచ్చారు.

బంగ్లా క్రికెటర్లను చూసి, పాకిస్తాన్ దడుచుకుంది

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు గతంలో లాగా లేదని… ఆస్ట్రేలియా లాగా తయారయిందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ( Ramiz Raja) సంచలన కామెంట్స్ చేశారు. ఆస్ట్రేలియా లాంటి బలమైన బౌలింగ్ తరహాలోనే బంగ్లాదేశ్ ఉందని.. అందుకే పాకిస్తాన్ ప్లేయర్లు ఓడిపోయారని చురకలు అంటించారు. అర్ధరాత్రుళ్ళు బంగ్లాదేశ్ బౌలింగ్ దళాన్ని తలచుకొని, పాకిస్తాన్ క్రికెటర్లు వణికిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

 

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×