E-Paper
Advertisement

ఇంగ్లండ్ చేతిలో 3-0 తేడాతో పాకిస్తాన్ వైట్ వాష్ కావ‌డం ప‌క్కా

ఇంగ్లండ్ చేతిలో 3-0 తేడాతో పాకిస్తాన్ వైట్ వాష్ కావ‌డం ప‌క్కా
Advertisement

Shoaib Akhtar On ENG VS PAK:   పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( Pakistan vs England) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్… హాఫ్ డే లోపే పాకిస్తాన్ ఆల్ అవుట్ అయింది. కేవలం 171 పరుగులు సాధించి కుప్ప కూలింది. పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ గెలిస్తే, నా పేరు మార్చుకుంటాన‌ని సవాల్ విసిరారు.

ఇంగ్లాండ్ చేతిలో 3-0 తేడాతో పాకిస్తాన్ వైట్ వాష్ కావ‌డం ప‌క్కా

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఉత్యంఠ భ‌రితంగా టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులలో ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ గెలవడం కష్టమేనన్నారు. ఈ సిరీస్ లో 3-0 తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించే శక్తి ఇంగ్లాండ్ కు ఉందని ఒప్పుకున్నారు అక్త‌ర్‌. ప్రస్తుత పరిస్థితిలో ఇంగ్లాండ్ బౌలర్లు అత్యంత ప్రమాదకంగా బౌలింగ్ చేస్తున్నారన్నారు.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

అలాగే ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ బ్యాటర్లు పరుగులు తీయడం చాలా కష్టమని వెల్లడించారు. అక్కడ బౌన్సీ మైదానాలు ఉండడమే కాకుండా… బౌండరీ గేట్లు చాలా పెద్దగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పరుగులు రావడం చాలా కష్టమని తేల్చి చెప్పారు షోయబ్ అక్తర్. దాని ఫ‌లితంగానే తొలి టెస్టులో మొద‌టి ఇన్నింగ్స్ సంద‌ర్భంగా తొంద‌రగానే పాక్ ఆలౌట్ అయింద‌ని చుర‌క‌లు అంటించారు.

ఇంగ్లాండ్ పై ఒక్క టెస్ట్ గెలిచిన నా పేరు మార్చుకుంటా

Advertisement

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ కోల్పోవడం గ్యారంటీ అన్నారు. అయితే ఇందులో ఒక్క టెస్ట్ అయిన పాకిస్తాన్ గెలిస్తే… అద్భుతమైనని వ్యాఖ్యానించారు. ఒక వేళ ఇంగ్లాండ్ పై పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే, తాను పేరు మార్చుకుంటాన‌ని ఛాలెంజ్ విసిరారు. వెస్టిండీస్ జట్టు పైన గెలిచినంత సులభంగా ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ గెలవడం చాలా కష్టమన్నారు. అందులోనూ కెప్టెన్ బాబర్ ఆజం గాయపడడం పాకిస్తాన్ కు నిజంగా ఎదురు దెబ్బేనని వివరించారు. అందుకే ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ వైట్ వాష్ కావడం గ్యారెంటీ అని తనకు అర్థమైందన్నారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

 

 

Related News

తిండికే దిక్కులేదు..సిల్వ‌ర్ మెడ‌ల్ తో పాకిస్తాన్ స‌ర్దుకుపోవాల్సిందే

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

Big Stories

Advertisement
×