E-Paper
Advertisement

SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!
Advertisement

Harry Brook On SRH: ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League tournament) గురించి హాట్ కామెంట్స్ చేశారు. అప్పట్లో ఐపీఎల్ కంటే జాతీయ జట్టు బెటర్ అంటూ వెళ్లిపోయిన హ్యారీ బ్రూక్ ( Harry Brook), ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ను మెచ్చుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న బ్యాన్ తొలగిన తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడతానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు చేసి వారం రోజులు కాలేదు, అంతలోనే మరో బాంబు వేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో (Sunrisers Hyderabad team) ఉన్నప్పుడు తాను నరకం చూసానని.. టోర్నమెంట్ మధ్యలోనే వెళ్లిపోయేలా అభిమానులు తనను ట్రోల్లింగ్ చేశారని హాట్ కామెంట్స్ చేశారు. ఒక్క మ్యాచ్ లో సరిగ్గా ఆడకపోయినా తనను ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టారని కీలక విషయాలను పంచుకున్నారు హ్యారీ బ్రూక్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

SRHలో న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

2023 సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున హ్యారీ బ్రూక్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క సీజన్ తర్వాత అతడిని కావ్య పాప రిలీజ్ చేశారు. అయితే 2023 సందర్భంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడిన అనుభవాలను తాజాగా హ్యారీ బ్రూక్ పంచుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున తాను చాలా మ్యాచ్ లే ఆడానని వివరించారు. కేకేఆర్ పై 50 బంతుల్లో 100 పరుగులు సాధించినట్లు గుర్తు చేశారు. అయితే మిగిలిన 10 ఇన్నింగ్స్ లలో తాను 90 పరుగులు మాత్రమే చేయడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయని వివరించారు. అక్కడి అభిమానులు తనపై భారీగా అంచనాలు పెట్టుకున్నారన్నారు. అయితే ఒక్క మ్యాచ్ లో విఫలమైనా, సోషల్ మీడియాలో తనను దారుణంగా ట్రోలింగ్ చేశారని SRH అభిమానులపై సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

స‌రిగ్గా ఆడ‌లేద‌ని, న‌న్ను కావ్య పాప‌నే పీకిప‌డేశారు

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తనను ట్రోలింగ్ చేసిన పోస్టులే కనిపించేవని బాంబు పేల్చారు. ఈ సోషల్ మీడియా స్క్రోలింగ్ కారణంగా మానసిక ఒత్తిడికి లోనయ్యాను అంటూ ఎమోషనల్ అయ్యారు. దాంతో సరిగ్గా ఆటపైన దృష్టి పెట్టలేకపోయానని తెలిపారు. ఇక ఈ టోర్నమెంట్లో తాను సరిగ్గా ఆడలేదని కావ్య పాప కూడా వేలంలో వదిలేసినట్లు గుర్తు చేశారు. అయితే తనపై బ్యాన్ ముగిసిన తర్వాత 2028 ఐపీఎల్ లో రీ-ఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. కాగా 2023 స‌మ‌యంలో 13.25 కోట్ల‌కు హ్యారీ బ్రూక్ ను కావ్య కొనుగోలు చేశారు. ఆ త‌ర్వాత ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగాడు. 2024లో స‌గం మ్యాచ్ లే ఆడి స్కిప్ అయ్యాడు. 2025లో కూడా టోర్న‌మెంట్ ప్రారంభంలోనే జంప్ అయ్యాడు. దీంతో బ్యాన్ విధించింది బీసీసీఐ.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

Related News

ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

ICC ఛైర్మ‌న్ గా జై షా ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌డం క‌ష్ట‌మే !

మైదానంలో ధోని ఆడుగు పెట్టేట‌ప్పుడు చెవుల్లో నుంచి ర‌క్తం వ‌స్తుంది

పొద్దున లేస్తే, గాయాలంటూ డ్రామాలాడే బుమ్రాను, వ‌సీం అక్ర‌మ్, వ‌కార్ ల‌తో పోల్చొద్దు !

సిరాజ్ మాస్ట‌ర్ మైండ్..స్లెడ్జింగ్స్ చేసి, సెంచ‌రీ చేయ‌కుండా బోల్తా కొట్టించాడు

శ్రీలంక‌లోనూ ఫ్లాట్ పిచ్ లు..దేవ్‌దత్ పడిక్కల్ భ‌యంక‌ర‌మైన ఇన్నింగ్స్‌

రే**ప్ కేసులో ట్విస్ట్…RCB శాప‌మే అభిషేక్ పోరెల్ కెరీర్ ముంచేసింది ?

Big Stories

Advertisement
×