E-Paper
Advertisement

సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇంగ్లీష్ మీడియాకు దూరంగా ఉండు..బాబ‌ర్ కు అక్త‌ర్ హెచ్చ‌రిక‌

సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇంగ్లీష్ మీడియాకు దూరంగా ఉండు..బాబ‌ర్ కు అక్త‌ర్ హెచ్చ‌రిక‌
Advertisement

Shoaib Akthar advises Babar: వెస్టిండీస్ పై రెండో టెస్టులో విజయం సాధించిన పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు తాజాగా ఇంగ్లాండ్ కు వెళ్ళింది. ఈ టూర్ నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు మూడు టెస్టులు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు మాజీ క్రికెటర్లు. ఇంగ్లాండ్ గడ్డపై మీడియా ముందుకు వెళ్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. బాబర్ ఆజం కు ఇంగ్లీష్ అంతంత మాత్రమే వస్తుందని.. ఇలాంటి క్రమంలో మీడియా ముందుకు వెళ్లి ఏదో ఒకటి వాగితే, పాకిస్తాన్ పరువు గంగలో కలుస్తుందని షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అనవసరంగా ఇంగ్లీష్ మీడియం ముందుకు వెళ్లి బాబర్ ఆజం అస్సలు మాట్లాడకూడదని సూచనలు చేశారు. మీడియా పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

నోటికి వ‌చ్చింది ఇంగ్లీష్ లో మాట్లాడి..పాకిస్తాన్ ప‌రువు తీయ‌కు

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరో వారం రోజుల్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం కచ్చితంగా ఇంగ్లీషులో మీడియాను అడ్రస్ చేయాలి. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెటర్ల ఇంగ్లీష్ ఫై దారుణంగా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. గతంలో కూడా బాబర్ ఆజం మాట్లాడిన ఇంగ్లీష్ పై సెటైర్లు కూడా పేల్చారు. ఇప్పటికీ పాకిస్తాన్ క్రికెటర్ల ఇంగ్లీష్ స్పీచ్ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం చాలా జాగ్రత్తగా ఉండాలని షోయబ్ అక్తర్ సూచనలు చేశారు. అవసరం ఉంటేనే మీడియా ముందుకు వెళ్లి.. రెండు లేదా మూడు వ్యాఖ్యల్లో ప్రెస్ మీట్ ముగించాలని కోరారు. ఇక మైక్ దొరికింది కదా అని.. రాజకీయ నాయకుల్లాగా స్పీచ్ లు అవసరం లేదని తెలిపారు. అలా మాట్లాడితే కచ్చితంగా బాబర్ ఆజం ట్రోలింగుకు గురి కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని రిక్వెస్ట్ చేశారు.

ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ లపై స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement

ఇంగ్లాండ్తో జరిగే మూడు టెస్టుల సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. వెస్టిండీస్ పై టెస్ట్ సిరీస్ ను సమం చేసుకున్నంత ఈజీగా.. ఇంగ్లాండ్ పై గెలవలేరన్నారు. ఇంగ్లాండ్ జట్టును దెబ్బ కొట్టాలంటే చాలా వ్యూహాలు అవసరమని పేర్కొన్నారు. వెస్టిండీస్ చేసిన తప్పిదాలను ఇంగ్లాండ్ అస్సలు చేయదని స్పష్టం చేశారు. వారు పూర్తిగా ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలంగా ఉండే మైదానాలను తయారు చేసి.. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ డిస్టర్బ్ చేస్తారని హెచ్చరించారు. దానికి తగ్గట్టుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

 

Related News

నా అవ‌స‌రం బంగ్లాదేశ్ కు ఉంది..లేక‌పోతే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేరు

బంగ్లాదేశ్ లో టీమిండియాకు సెక్యూరిటీ లేదు..స్టేడియంపై దాడులు జ‌రిగే ఛాన్స్‌?

కేవ‌లం నెట్స్ లో ప్రాక్టీస్ చేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌తామంటే కుద‌ర‌దు !

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబర్ కు కొమ్ములు వ‌చ్చాయి, అత‌డి PR ఎగిరిపడుతోంది

హార్ధిక్ పాండ్యా రీ-ఎంట్రీ..గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు ?

న‌ఖ్వీ మాట విని రోడ్డున బంగ్లాదేశ్‌…ఫుట్ బాల్ ఆడుకుంటోన్న BCCI

ఆసియా క‌ప్ లాగే 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా దొంగిలించిన మొహ్సిన్ న‌ఖ్వీ?

Big Stories

Advertisement
×