BigTV English

Shreyas Iyer Love Story: ఒకరోజు కలలోని ఊర్వశి.. కనిపించింది: శ్రేయాస్!

Shreyas Iyer Love Story: ఒకరోజు కలలోని ఊర్వశి.. కనిపించింది: శ్రేయాస్!
Shreyas Iyer
Shreyas Iyer

Cricketer Shreyas Iyer Love Story: ఎప్పుడూ సీరియస్ గా ఉండే శ్రేయాస్ అయ్యర్ లో కూడా రొమాంటిక్ టచ్ ఉందనే సంగతి బయటకు వచ్చింది. చాలామంది జీవితాల్లో ఒన్ సైడ్ లవ్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ కూడా అందులో తక్కువేం కాదు. తన జీవితంలో కూడా ఒకమ్మాయి ఉంది. అది ధోనీ సినిమాలో అందరూ చూశారు.


ఇక క్రికెటర్ల విషయంలో ఇవన్నీ కామన్ గా ఉంటాయి. విరాట్ కొహ్లీ ఏకంగా హీరోయిన్ అనుష్కశర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అజారుద్దీన్ అయితే పెళ్లయిన భార్యను వదిలేసి, సంగీతా బిజ్ లానీతో సహజీవనం చేశాడు.ఇలా ఒకరు ఇద్దరు కాదు, ఎందరో ఉన్నారు. వారితో పాటే ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ కి కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. ఈ విషయాన్ని తను ఒక టీవీ షో సందర్భంగా చెప్పాడు. అది కమేడియన్ కపిల్ శర్మ షో. అందులో రోహిత్ శర్మ, శ్రేయాస్ ఇద్దరూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కపిల్ శర్మ మాట్లాడుతూ శ్రేయాస్ బౌండరీ కొట్టినప్పుడల్లా శ్రేయాస్ మ్యారీ మీ.. అనే పోస్టర్లు కనిపిస్తుంటాయి. అలా ఎప్పుడైనా ఎవరినైనా చూశారా..? అని కపిల్ శర్మ అడిగాడు.
అందుకు శ్రేయాస్ సరదాగా సమాధానమిచ్చాడు. అయితే ఒకసారి మాత్రం.. నాకు నచ్చిన అందమైన అమ్మాయిని చూశాను. తనైతే మ్యారీ మీ అనే బోర్డు అయితే పట్టుకోలేదు కానీ, స్టాండ్ లో మాత్రం చాలా అందంగా కనిపించింది.


అంటే తను నా మనసుకి నచ్చింది. అందరికి నచ్చుతుందో లేదో తెలీదు. కానీ చూడటానికి చాలా బాగుంది.. అని అన్నాడు. అయితే తనకి హలో కూడా చెప్పాను. ఇది జరిగి చాలా కాలమైందని అన్నాడు. అప్పట్లో ఫేస్ బుక్ చాలా పాపులర్. అందులో చాలా కాలం ఎదురుచూశాను. కానీ తనెక్కడా  కనిపించ లేదు.

Also Read: రవీంద్ర జడేజా త్రిబుల్ రికార్డ్..

నాకు చాలా మెసేజ్ లు వస్తుంటాయి. అవి చాలాకాలం చూసుకున్నాను. ఆ అమ్మాయి స్పందించి పెడుతుందేమో అనుకునేవాడిని. అలా జరగలేదు. నా జీవితంలో నాకు ఎదురైన ఒకే ఒక్క అనుభవమని అన్నాడు. దీనికి చాలామంది నెటిజన్లు బహుశా అప్పటి నుంచే శ్రేయాస్ ముఖంలో చిరునవ్వు పోయి, సీరియస్ నెస్ వచ్చినట్టుంది. బహుశా ఇంక ప్రేమ జోలికి వెళ్లడేమో శ్రేయాస్ అని కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తర్వాత రోహిత్ శర్మని మాత్రం కపిల్ శర్మ ఒక ప్రశ్న వేశాడు. మీరు రూమ్ షేర్ చేసుకోవాలంటే ఎవరితో ఉంటారని అడిగితే, ఎవరైనా ఓకే గానీ, ఆ ఇద్దరు మాత్రం బాబోయ్ అన్నాడు. ఎవరు వాళ్లని కపిల్ రెట్టించి అడిగితే ధావన్, రిషబ్ ఇద్దరు కూడా రూమ్ ని అస్సలు క్లీన్ గా ఉంచరని నవ్వుతూ అన్నాడు. మొత్తానికి టీవీ షో ద్వారా నెటిజన్లకు కపిల్ శర్మ మంచి పని పెట్టాడని అందరూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×