BigTV English

Shreyas Iyer Father : నా కొడుకుని వేధిస్తున్నారు.. టీమిండియా కెప్టెన్సీ అడగలేదు.. జట్టులో ఛాన్స్ మాత్రమే ఇవ్వండి ప్లీజ్.. అయ్యర్ తండ్రి ఎమోషనల్

Shreyas Iyer Father : నా కొడుకుని వేధిస్తున్నారు.. టీమిండియా కెప్టెన్సీ అడగలేదు.. జట్టులో ఛాన్స్ మాత్రమే ఇవ్వండి ప్లీజ్.. అయ్యర్ తండ్రి ఎమోషనల్

Shreyas Iyer Father : టీమిండియా (team india)  క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అతను క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్(IPL) లో పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ఆడి 604 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అదేవిధంగా ఆ జట్టును రన్నరప్ గా నిలిపాడు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకంగా వ్యవహరించాడు శ్రేయస్ అయ్యర్. 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా వ్యవహరించి టైటిల్ అందించాడు. ఇలా ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకున్నా.. ఎన్ని రన్స్ కొట్టినా ఎన్ని టైటిల్స్ అందించినా సెలెక్టర్లకు మాత్రం శ్రేయాస్ అయ్యర్ కనిపించడు అంటూ అభిమానులు పేర్కొంటున్నారు. ఆసియా కప్ భారత్ జట్టులో టీమిండియా క్రికెటర్ అయ్యర్ కి చోటు దక్కకపోవడంపై క్రికెట్ అభిమానులు బీసీసీఐ (BCCI) పై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) బీసీసీఐ (BCCI) ని రిక్వెస్ట్ చేశాడు.


Also Read : Nicholas Pooran : స్టంప్ ఔట్ ఎఫెక్ట్… నికోలస్ పురాన్ కిందపడి ఎలా గిలగిల కొట్టుకున్నాడో చూడండి

శ్రేయాస్ తండ్రి ఎమోషనల్.. 


శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ని ఆసియా కప్ 2025 (Asia Cup 2025)  కోసం సెలెక్ట్ కాకపోవడంతో.. తాజాగా శ్రేయాస్ అయ్యర్ తండ్రి ఎమోషనల్ అయ్యాడు. ” నా కొడుకుని వేధిస్తున్నారు.. టీమిండియా కెప్టెన్సీ అడగలేదు.. జట్టులో ఛాన్స్ మాత్రమే ఇవ్వండి ప్లీజ్ ” అంటూ  అయ్యర్ తండ్రి ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు టీమిండియా జట్టును ఎంపిక చేసే సమయంలో ఏవో రాజకీయాలు జరుగుతున్నాయని పలువురు క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ ని తొలుత సెంట్రల్ కాంట్రాక్ట్ రిమూవ్ చేశారు. 2024 రంజీ ట్రోఫీలో విజయం సాధించాడు. SMAT 2024లో విజయం.. 2024 ఐపీఎల్ లో విజయం, ఇరానీ 2024 లో విజయం, 2025 ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు రన్నరప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం, రిటర్న్ సెంట్రల్ కాంట్రాక్ట్ 2024/25, ఐపీఎల్ 2025లో 604 రన్స్, అత్యధిక స్కోర్ 175 ఇలా టాలెంట్ ఉన్న ఆటగాడిని అస్సలు ఎందుకు సెలెక్ట్ చేయడం లేదని.. బీసీసీఐ  (BCCI) పై మండి పడుతున్నారు.

శ్రేయస్ సెలెక్ట్ కాకపోవడం పై క్లారిటీ.. 

మరోవైపు కోచ్ గంభీర్ పాలిటిక్స్ తో సర్పంచ్ సాబ్ ను తొక్కి పడేశారని గంభీర్ పై మండిపడుతున్నారు. సర్పంచ్ సాబ్ కి ఇంత అన్యాయమా..? అని ఫైర్ అవుతున్నారు. టీమిండియా (team india) టెస్ట్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ను అతని స్థానంలో వైస్ కెప్టెన్ ని నియమించింది. చాలా రోజుల నుంచి టీ-20లలో టీమిండియా కి దూరంగా ఉన్న గిల్ కి ఏకంగా ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కు మాత్రం మరోసారి మొండిచేయి చూపించింది. 15 మంది సభ్యులతో కూడిన ఆసియా కప్ 2025 జట్టులో ఈ ముంబై బ్యాట్స్ మెన్ కి స్థానం దక్కలేదు. కనీసం స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో కూడా అయ్యర్ పేరు లేకపోవడం గమనార్హం. మరోవైపు అజిత్ అగార్కర్ (Ajith Agarkar) స్పందిస్తూ.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) జట్టుకి ఎంపిక కాకపోవడంలో అతని తప్పు ఏమి లేదు. అలాగే మా తప్పు కూడా ఏం లేదు. అతను ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఎవరి స్థానంలో అతన్ని తీసుకురావాలో మీరే చెప్పండి..? అని మీడియానే ఎదురు ప్రశ్నించారు అగార్కర్. 15 మందికి మాత్రమే స్థానం ఉందని.. అందుకే అయ్యర్ ని తీసుకోలేకపోయామని స్పష్టం చేశారు.

Related News

Rohit Sharma : రోహిత్ శర్మకు ఘోర అవమానం… ఆ మ్యాచ్ లు ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు

BCCI New Fitness Test : టీమిండియా ప్లేయర్లకు కొత్త పరీక్షలు… 1200 మీటర్లు.. ఐదు రౌండ్లు… రెస్ట్ లేకుండా పరిగెత్తాల్సిందే

Nicholas Pooran : స్టంప్ ఔట్ ఎఫెక్ట్… నికోలస్ పురాన్ కిందపడి ఎలా గిలగిల కొట్టుకున్నాడో చూడండి

Brock Lesnar’s daughter: అర్థ న**గ్నంగా WWE స్టార్ కూతురు.. ఫోటోలు వైరల్

Watch Video : ఒక్క బంతికి 6 పరుగులు.. నాన్ స్ట్రైక్ బ్యాట్స్మెన్ చేసిన పనికి పిచ్చెక్కి పోవాల్సిందే

Big Stories

×