E-Paper
Advertisement

ప్రీతి జింటా మీరు హాయిగా పడుకోండి..శ్రేయస్ వల్ల కానీ, తొలి టైటిల్‌ హార్దిక్ పాండ్యా తెచ్చి చూపిస్తాడు

ప్రీతి జింటా మీరు హాయిగా పడుకోండి..శ్రేయస్ వల్ల కానీ, తొలి టైటిల్‌ హార్దిక్ పాండ్యా తెచ్చి చూపిస్తాడు
Advertisement

AMBATI RAYUDU ON HARDIK PANDYA:  ఐపీఎల్ 2027 టోర్నమెంట్ వేలం దగ్గర పడుతున్న క్రమంలో ట్రేడ్ ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది. ట్రేడ్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే చాలా మంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు మార్చుకున్నాయి. హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ కోసం జరిగిన ట్రేడే ఐపీఎల్ 2027లో అతి పెద్దది. అంబానీ, ప్రీతి జింటా ఫ్రాంచైజీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పంజాబ్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా రాగా, ముంబై ఇండియన్స్ జట్టులోకి అర్ష్ దీప్ సింగ్ వెళ్లనున్నాడు. ఇలాంటి తరుణంలోనే అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఒప్పందం ద్వారా ముంబై ఇండియన్స్ కంటే, పంజాబ్ కింగ్స్ జట్టే ఎక్కువగా లాభం పొందినట్టు వ్యాఖ్యానించాడు. అంతేకాదు పంజాబ్ కింగ్స్ వచ్చే ఐపీఎల్ లో టైటిల్ కొడుతుందని అంచనా వేశాడు. ప్రీతి జింటా మీరు హాయిగా పడుకోండని పేర్కొన్న అంబటి రాయుడు..శ్రేయస్ అయ్యర్ వల్ల కానీ, తొలి టైటిల్‌ ను హార్దిక్ పాండ్యా అందిస్తాడు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో పాండ్యాపై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

టెన్షన్ వద్దు..పంజాబ్‌కు హార్దిక్ పాండ్యా తొలి టైటిల్‌ అందిస్తాడు

పంజాబ్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా రావడంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్ లోకి పాండ్యా వస్తున్న తరుణంలోనే కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ నాశనం చేసినట్టుగానే పంజాబ్ జట్టును భ్రష్టు పట్టిస్తారని ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహించాడు. అలాంటి సంఘటనలేమీ పంజాబ్ లో జరుగబోవని వెల్లడించాడు. పంజాబ్ కింగ్స్ కు తొలి టైటిల్ హార్దిక్ పాండ్యా అందిస్తాడని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రీతి జింటా సరిగ్గానే ఆలోచించి, పాండ్యాను తీసుకుందని మెచ్చుకున్నాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనే హార్దిక్ పాండ్యా స్వేచ్ఛగా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అయ్యర్ ను పీకేసి, పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తారనే ప్రచారం అవాస్తమన్నాడు. ఫేక్ ముచ్చట్లు బంద్ చేసి, హార్దిక్ పాండ్యా బీభత్సాన్ని కళ్లారా చూడాలంటూ ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చాడు. పంజాబ్ కు టైటిల్ అందించేందుకు శ్రేయస్ అయ్యర్ చాలా కష్టపడుతున్నాడని, హార్దిక్ పాండ్యా కాస్త సహాయ పడితే తిరుగుండదని తెలిపాడు. అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కు పాండ్యానే తొలి టైటిల్ అందిస్తాడని అంచనా వేశాడు. గుజరాత్ టైటాన్స్ కు తొలిసారి టైటిల్ అందించిన మొనగాడు పాండ్యానే అన్న విషయం ఎవరూ మర్చిపోవద్దని స్పష్టం చేశాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

మొన్న మోడీ, నేడు జై షా…బడా నేతలను సూర్య కుమార్ కలవడం వెనుక రహస్యం ఏంటి?

‘షాహిద్ అఫ్రిది’ను వాడుకుని గ్యాంగ్‌స్టర్ ఆట క‌ట్టించిన‌ పంజాబ్

ఆర్య‌వీర్ సెహ్వాగ్ సెంచ‌రీ…బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

భారీ వ‌ర్షంతో మూడో వ‌న్డే ర‌ద్దు..టీమిండియా, కివీస్ సిరీస్ పై విచార‌ణ చేయాలంటూ?

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PKR 15,000 రివార్డు

ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లు…బీసీసీఐకి రూ.16,600 కోట్ల లాభం?

శ‌భాష్ కావ్య‌… ఆమె దెబ్బ‌కు చెన్నై, ఢిల్లీ జ‌ట్లు స‌గం చ‌చ్చిపోయాయి

Big Stories

Advertisement
×