Shubman Gill Worst Performance in Duleep Trophy 2024: శుభ్ మన్ గిల్.. ఇండియన్ క్రికెట్ లో ఒక్కసారిగా మెరిసిన క్రికెటర్.. ఇతని దూకుడు, ఆట, స్టయిల్ అంతా చూసిన జనం విరాట్ కొహ్లీ వారసుడు వచ్చాడని అనుకున్నారు. అంతే అప్పటి నుంచి మనవాడి స్పీడు పడిపోయింది. బీసీసీఐ ఎన్నో అవకాశాలు ఇస్తూ వస్తోంది. ఇంత సపోర్టు శ్రేయాస్ కి దక్కింది. తను నిలబెట్టుకోలేదు. దీంతో బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కి పక్కన పెట్టారు. రేపు గిల్ పరిస్థితి ఇలా కాకూడదని అంతా అనుకుంటున్నారు.
ఎన్ని చేసినా, ఎంత చేసినా గిల్ ఫామ్ లోకి రాలేకపోతున్నాడు. అప్పుడే వచ్చినట్టు కనిపిస్తున్నాడు. మళ్లీ వెంటనే వెనక్కి పోతున్నాడు. మొన్న శ్రీలంక టూర్ లో కూడా పెద్దగా ఆడలేదు. నిరాశపరిచాడు. ఐపీఎల్ కూడా అంతంతమాత్రమే. ఇప్పుడు తాజాగా దులీప్ ట్రోఫీలో కూడా ఇదే ఆటతీరుతో అందరికి చిరాకు తెప్పిస్తున్నాడు.
ఇండియా బీ కెప్టెన్ గా ఎంపికైక గిల్ తొలి ఇన్నింగ్స్ లో 25 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్సులో కూడా చేతులెత్తేశాడు. 35 బంతులెదుర్కొని 2 బౌండరీల సాయంతో 21 పరుగులు చేశాడు. ఇక నిలబెడతాడు.. భారీ ఇన్నింగ్స్ ఆడతాడు.. జట్టుకి అవసరమైన 275 పరుగులు చేసి గెలిపిస్తాడని అంతా అనుకున్నారు.
ఇలా అనుకున్నారో లేదో అలా అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయి ఉండి, దులీప్ ట్రోఫీ ఆడే, అంతర్జాతీయ అనుభవం లేని బౌలర్ల చేతిలో అవుట్ అయిపోతే ఎలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రెండు సార్లు కూడా నవదీప్ సైనీ బౌలింగులోనే అవుట్ కావడం విశేషం. తనకిదో వీక్ నెస్ గా మారిపోతోందని అంటున్నారు.
Also Read: బంగ్లాతో తొలి టెస్ట్.. మహ్మద్ షమీకి దక్కని చోటు
ఒకసారి ఎవరిచేతిలో బౌల్డ్ అవుతాడో, అతని చేతిలోనే పదే పదే అవుట్ అవడం షరా మామూలుగా మారిపోయింది. ఈ బలహీనతల నుంచి తను బయటకి రావాలని సీనియర్లు సూచిస్తున్నారు. ఇంక ఇలాగే ఆడితే లాంగ్ టెర్మ్ లో గిల్ కి ఉద్వాసన తప్పదని అంటున్నారు. రోబోవు కాలంలో ఇండియా 10 టెస్టు మ్యాచ్ లు, మూడు దేశాలతో ఆడనుంది. ఆ తర్వాత అన్నీ బాగుండి, పాయింట్లు బాగుంటే, వచ్చే ఏడాది జూన్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడుతుంది.
ఈ సమయంలో.. ఒకనాడు అద్భుతంగా ఆడిన గిల్ ఇలా వెనుకడుగు వేయడంపై అభిమానులు తల పట్టుకుంటున్నారు. మరి గిల్ ఎలా మళ్లీ పుంజుకుని పూర్వ వైభవం తెస్తాడో, జట్టుకి భారంగా కాకుండా వరంగా మారతాడో చూడాల్సిందే.