అయితే, కశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అందులో ఓ టూరిస్ట్ జిప్ లైన్ పై వెళ్తుండుగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన స్పాట్ ఏరియా మొత్తం ఆ వీడియోలో కవర్ అయ్యింది. ఉగ్రవాదుల కాల్పులకు పర్యాటకులు భయంతో పరుగులు తీసినట్టు వీడియోలో కనిపించింది. పర్యాటకలను ఉగ్రవాదులు కాలుస్తున్న సౌండ్లు భారీగా వీడియోలో వినిపిస్తున్నాయి.
కశ్మీర్ అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నప్పుడు అక్కడున్న టూరిస్టులు భయాందోళనకు గురై ఒక్క సారిగా పరుగులు తీశారు. ఓ టూరిస్ట్ జిప్‌లైన్‌లో వెళ్తూ సెల్ఫీ వీడియోలో ఇదంతా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఆ వీడియోలు తుపాకుల శబ్ధం, టూరిస్టులు పరిగెడుతున్న విజువల్స్ నీటిగా కనిపిస్తున్నాయి.
Another horrific footage of #PahalgamTerroristAttack.
— Bharggav Roy 🇮🇳 (@Bharggavroy) April 28, 2025
అదే ఏరియాలో తీవ్రవాదులు 28 మంది పర్యటకులను టెర్రరిస్టులను దారుణంగా కాల్చి చంపారు. ఉగ్రవాదుల భయానికి ఓ యువకుడు పరిగెడుతూ కింద పడిపోవడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో తీసిన వ్యక్తి పేరు రిషి భట్. దాదాపు 16, 18 మందిని హత్య చేయడం జిప్‌లైన్ పై నుంచి వెళ్తూ ఆయన చూశానని ఆయన చెప్పారు. జిప్ లైన్ ఆపరేటర్ అల్లా హు అక్బర్ అని గట్టిగా అరిచి.. ఆ తర్వాత వెంటనే కాల్పులు జరపడం స్టార్ట్ చేశాడని అన్నారు.
అతని జిప్‌లైన్ స్టార్ట్ అయ్యాక… 15 సెకన్ల తర్వాత కాల్పులు జరిగాయని చెప్పాడు. అప్పటికే అతని భార్య, పిల్లాడు కింద నుంచి కేకలు వేస్తున్నారని రిషి భట్ వివరించాడు. ఈ విశాలమైన ప్రదేశంలో ఉన్న పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిగాయని ఆ భయంకరమై దృశ్యాలు ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చాడు.
Also Read: Pakistan Airlines: భారత్‌పై ఆంక్షలు విధించి.. బొక్కబోర్లా పడుతున్న పాకిస్థాన్..