Hyper Aadi: తెలుగు టెలివిజన్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.. వాటిలో ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఈటీవీ తెలుగులో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రసారమవుతుంది. ఈ షో మొత్తం కామెడీ స్కిట్స్, డాన్స్ సింగింగ్, సరదా సంభాషణలతో నిండిపోతుంది. ఈ వారం రానున్న షో కి సంబంధించిన ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ వారం షోలో హైపర్ ఆది, రష్మి గౌతమ్ ఇమ్మానియేల్, సౌమ్య రావు, నరేష్, భాస్కర్, పాల్గొన్నారు. ఈ షోకి జడ్జిగా ప్రముఖ నటి ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో సౌమ్య రావు పాడిన పాటను ఉద్దేశించి హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె ఏ పాట పాడింది.. హైపర్ ఆది ఏమని కామెంట్ చేశాడో ఇప్పుడు చూద్దాం..
ఆది కౌంటర్..
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఎపిసోడ్ లో విభిన్నమైన థీమ్స్ తో స్కిట్స్ తో.. రొమాంటిక్ డాన్స్లతో.. సినిమా స్పూఫ్ ల తో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా మే 4వ తారీఖు ఆదివారం జరిగే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో సౌమ్య రావు యువ సినిమాలో సంకురాత్రి కోడి, కత్తిలాంటి కోడి అనే పాటను పాడుతుంది. వెంటనే ఆది మీరు పాడిన పాటకు అర్థం చెప్పండి అని అడుగుతాడు. సంక్రాంతిలో ఒక కోడి వస్తుంది. అది కత్తిలాంటి కోడి అంటే.. నైఫ్ లాగా ఉంటుంది అని సౌమ్య అనగానే.. ఆది ఆ కత్తితోనే కోడిని కోసుకొని తినేయాలి కదా అని ఆది పంచ్ వేస్తాడు. నువ్వు పాడిన పాట ఏంటి చెప్పిన అర్థం ఏంటి సౌమ్య అని ఆది కౌంటర్ ఇస్తాడు. సౌమ్య షాక్ అవుతుంది. ఈ ప్రోమో చూసిన వారంతా సౌమ్య పాడిన పాటకు ఆది కరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడంటూ.. కామెంట్ చేస్తున్నారు.
ప్రోమో హైలైట్స్ ..
శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ ప్రోగ్రాం లో నటించిన వారికి సినిమాలలో నటించే ఆఫర్స్ రావడం విశేషం. ఈ ప్రోగ్రాం కి ఎంతోమంది సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేసి ఈ ప్రోగ్రాంను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో … స్టార్టింగ్ లోనే 2024- 2025 సంవత్సరం టీవీ ఫలితాలు విడుదల అంటూ బ్యాగ్రౌండ్ లో వాయిస్ వినిపిస్తుంది. ఆటల్లో, పాటల్లో, డాన్సులలో, కామెడీలో అన్నింట్లోనూ నెంబర్ వన్ శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు వస్తోంది అంటూ ప్రోమో మొదలవుతుంది. ఈ ప్రోగ్రాం కు కాలేజీ స్టూడెంట్స్ వస్తారు. ఆది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మీకేంటి పని అని అనడంతో.. అక్కడ ఉన్న నరేష్ వీళ్లు నా వాళ్ళు, నా కోసం వచ్చారు అని అంటాడు. అక్కడున్న స్టూడెంట్స్ తో ఆది సరదాగా ముచ్చటిస్తాడు. కాలేజీ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ జరుపుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీకి స్టూడెంట్స్ వచ్చినట్టుగా ప్రోమోలో చెప్తారు. తర్వాత జానపద పాటను లక్ష్మన్న పడతాడు. ఒకవైపు ఆర్టిస్టులు మరోవైపు కాలేజీ స్టూడెంట్స్, ఇద్దరు చేత రేష్మి ఆటలాడిస్తుంది. ఆ తర్వాత సౌమ్య రావు సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి అనే పాట పాడుతుంది. అందుకు అది ఆ పాట పై పంచ్ వేస్తాడు. ఫైమా కాలేజీలో అమ్మాయిపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఓ స్కిట్లు చేస్తుంది. ప్రోమో లాస్ట్ లో స్వీట్ మెమోరీస్ అంటూ వచ్చిన కాలేజీ స్టూడెంట్స్, టీచర్స్ తో ఫోటోలను దిగుతారు. ఇక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఈ ప్రోమో చూసిన వారంతా ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.
Actor Nandu : ఈ దరిద్రం ఇక నాకొద్దు… ఈ కారణంతో సోషల్ మీడియాను పూర్తిగా వదిలేసిన నటుడు