Tilak Varma: తెలుగోడు తిలక్ వర్మ ( Tilak Varma) సరికొత్త చరిత్ర సృష్టించాడు…నిన్న ఇంగ్లాండ్ జట్టుపై విరోచిత పోరాటం చేసిన తెలుగోడు తిలక్ వర్మ… కోహ్లీ, మార్క్ చాప్మన్ రికార్డు బద్దలు కొట్టాడు. దీంతో… టీ20 క్రికెట్ లోనే తొలి ప్లేయర్ గా నిలిచాడు తిలక్ వర్మ. నిన్న చెన్నైలో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరకు పోరాడిన టీమిండియా… తిలక్ వర్మ ( Tilak Varma) అద్భుతమైన బ్యాటింగ్ తో గెలిచింది.
Also Read: Ind vs Eng T20: టీమిండియా కు బిగ్ షాక్… రింకూ, నితీష్ ఇద్దరూ ఇంగ్లాండ్ సిరీస్ నుంచి ఔట్??
ఈ మ్యాచ్ లో 72 పరుగులతో దుమ్ములేపిన తిలక్ వర్మ…పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. మొదటగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. నాలుగు T20I ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా విరాట్ కోహ్లి నిన్నటి వరకు ఉండేవాడు. అయితే.. ఆ రికార్డును బద్దలు కొట్టిన తిలక్ వర్మ… వరుసగా నాలుగు T20I ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. వరుసగా నాలుగు ఇన్నింగ్స్ ల్లో ఔట్ అవ్వకుండానే అద్భుతమైన 318 పరుగులు చేశాడు తిలక్ వర్మ ( Tilak Varma).
ఇక ఈ రికార్డులో విరాట్ కోహ్లి ( Virat Kohli ) (258), సంజూ శాంసన్ (257), రోహిత్ శర్మ (253), శిఖర్ ధావన్ (252)లు ఉన్నారు. వారందరినీ ఇప్పుడు తెలుగోడు తిలక్ వర్మ ( Tilak Varma) దాటేసి… 318 పరుగులు చేశాడు. తెలుగోడు తిలక్ వర్మ.. చివరి నాలుగు ఇన్నింగ్స్ ఒకసారి పరిశీలిస్తే… తన చివరి మూడు T20I ఇన్నింగ్స్‌లలో 19*, 120* 107* పరుగులు చేశాడు. ఇక నిన్నటి చెపాక్‌లో 55 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు తిలక్ వర్మ. ఈ ఇన్నింగ్స్ కారణంగానే… ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వచ్చింది.
Also Read: Ind vs Eng 2nd T20I: టాస్ గెలిచిన టీమిండియా…రింకూతో పాటు మరో ముగ్గురు దూరం !
అంతేకాకుండా ఈ తెలుగు కుర్రాడు… తిలక్ వర్మ మరో రికార్డు కూడా సృష్టించాడు. న్యూజిలాండ్ క్రికెటర్.. మార్క్ చాప్ మాన్ ( Mark Chapman ) రికార్డును బద్దలు కొట్టాడు తిలక్ వర్మ. టి20 మ్యాచ్లలో రెండు డిస్మిసల్స్ మధ్య అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టారు. తన చివరి 4 మ్యాచ్ లలో అవుట్ కాకుండా 318 పరుగులు చేయడంతో ఈ రికార్డు సృష్టించాడు తిలక్ వర్మ. గతంలో వరుసగా నాలుగు ఇన్నింగ్స్ లలో అవుట్ కాకుండా న్యూజిలాండ్ క్రికెటర్.. మార్క్ చాప్ మాన్ ( Mark Chapman ) 271 పరుగులు చేశాడు. అయితే తాజాగా 318 చేసి ఆ రికార్డు కూడా బదులు కొట్టాడు తిలక్ వర్మ ( Tilak Varma). కాగా.. నిన్న చైన్నెలో జరిగిన మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా.
🚨 TILAK VERMA CREATED HISTORY 🚨
– TILAK VERMA NOW HAS MOST RUNS BETWEEN TWO DISMISSALS IN T20I INT'L HISTORY (318*). 🤯 pic.twitter.com/huquBuzuot
— Tanuj Singh (@ImTanujSingh) January 25, 2025