IndiGo Flight: చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఓ విమానంలో బాంబు బెదిరింపులతో ప్రయాణికులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఫైనల్లీ అధికారుల చెకింగ్స్ తో బాంబు బెదిరింపులు ఫేక్ అని తేలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొచ్చి నుంచి చెన్నైకి వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం నిన్న రాత్రి 171 మంది ప్రయానికులతో చెన్నై చేరుకుంది. అయితే ఈ విమానం టేకాఫ్ అవుతుండగా.. ఇద్దరు ప్రయాణికుల మధ్య ఒక్కసారిగా వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వారు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇదే టైంలో ప్లైట్ సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. తమ దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు.
దీంతో ఒక్కసారిగా విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు సిబ్బంది అంతా భయపడ్డారు. వెంటనే పైలట్ చెన్నై ఎయిర్‌పోర్టు కంట్రోల్ రూం అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎయిర్ పోర్టుకు టాస్క్ ఫోర్స్, బాంబ్ స్కాడ్, ఏవియేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లు చేరుకున్నారు. అర్థరాత్రి 12 గంటలకు చెన్నై ఎయిర్ పోర్టులోని రిమోట్ బేలో విమానం ఆగింది. తర్వాత విమానంలో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 2-30 నిమిషాల వరకు చెకింగ్స్ చేశారు.
Also Read: ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్ పరుగులు..ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయం!
వారి దగ్గర ఎలాంటి బాంబులు లేవని అధికారులు స్పష్టం చేశారు. విమానంలో అల్లర్లు, బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు ప్రయాణికులను భద్రతా సిబ్బంది పట్టుకొని.. చెన్నై విమానాశ్రయ పోలీసుకు అప్పగించారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఎందుకు గొడవకు దిగారు.. బాంబు బెదిరింపు వెనక కారణం ఏంటి…వీరిద్దరూ చెన్నైకి ఎందుకొచ్చారన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు.
ప్రైవేటు విమానంలో ప్రయాణికుల ఘర్షణ.. బాంబు బెదిరింపులు..
కొచ్చి నుంచి చెన్నై వస్తున్న ప్రైవేటు ప్యాసింజర్ విమానంలో టేకాఫ్ అవుతుండగా..ఓ విదేశీ ప్రయాణికుడితో పాటు ఇద్దరు వ్యక్తులు మధ్య ఘర్షణ
బాంబు పెడతామని బెదిరించిన ప్రయాణికుడు
ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి దాదాపు 3 గంటల పాటు… pic.twitter.com/bN74qkAvsw
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2025