BigTV English

SRH vs MI: ఉప్పల్ లో అద్భుత ఘట్టం…. SRH, ముంబై ప్లేయర్లు చేసిన పని చూడండి

SRH vs MI: ఉప్పల్ లో అద్భుత ఘట్టం…. SRH, ముంబై ప్లేయర్లు చేసిన పని చూడండి

SRH vs MI:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా అద్భుతమైన సంఘటన జరిగింది. ఈ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి అంటే ముందు… సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH) అలాగే ముంబై ఇండియన్స్ ప్లేయర్లు… ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన యాత్రికులకు సంతాపం తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Also Read: Memes on PSL : ఇదెక్కడి క్రికెట్ రా PSLలో లారీలు వస్తున్నాయి… త్వరలో రైలు కూడా వస్తాయి

2 నిమిషాల పాటు మౌనం పాటించిన ప్లేయర్లు


ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో…. ప్లేయర్ లందరూ పహల్గామ్ ఉగ్రదాడిలో బాధితులకు సంఘీభావం తెలిపారు. ముంబై ఇండియన్స్ అలాగే హైదరాబాద్ క్రికెటర్లు బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపం తెలపడం జరిగింది. ఇరుజట్ల ప్లేయర్లే కాకుండా స్టేడియం కు వచ్చిన ప్రేక్షకులు కూడా నిలబడి… మృతులకు నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నల్ల బ్యాడ్జి తో బరిలోకి దిగిన ప్లేయర్లు

జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 28 మంది యాత్రికులు మరణించారు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో… ఉగ్రవాదుల దాడికి నిరసనగా, మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరేలా.. ముంబై ఇండియన్స్ అలాగే హైదరాబాద్ ప్లేయర్లు ఇద్దరు కూడా నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగారు. ఉప్పల్ లో ఇరుజట్ల ప్లేయర్లు నల్ల బ్యాడ్జీలతోనే మ్యాచ్ ఆడుతున్నారు. అంతకుముందు స్టాండింగ్ ఓవయేషన్ ఇచ్చి… మరణించిన వారికి నివాళులు కూడా అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ప్లేయర్లు, స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్.

జమ్ము కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్

మంగళవారం రోజున… జమ్ము కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గాం అనే పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు బరితెగించారు. దాదాపు నలుగురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయి.. 28 మంది యాత్రికులను దారుణంగా కాల్చి చంపేశారు. మహిళలు అలాగే పిల్లలను వదిలేసి కేవలం పురుషులను గుర్తించి మరి చంపేశారు. ఇప్పుడు ఈ సంఘటన ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది.

సన్రైజర్స్ హైదరాబాద్ ను కాపాడుతున్న కాటేరమ్మ కొడుకు

బుధవారం జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ లో కాటేరమ్మ కొడుకు క్లాసెన్ అద్భుత ప్రదర్శనతో దుమ్ము లేపుతున్నాడు. 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టును… తన భుజాలపై వేసుకొని మోసాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు కాటేరమ్మ కొడుకు.

Also Read: SRH VS MI: ఇంకా SRHకు ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి… ఈ మ్యాచ్ లు గెలుస్తే చాలు

 

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×