E-Paper
Advertisement

గంభీర్ కు బుర్ర ఉందా? తలా తోక తెలియ‌ని బౌలర్లతో 2027 వరల్డ్ కప్ గెలవ‌లేం !

గంభీర్ కు బుర్ర ఉందా? తలా తోక తెలియ‌ని బౌలర్లతో 2027 వరల్డ్ కప్ గెలవ‌లేం !
Advertisement

Kris Srikkanth On Indian Bowlers:  2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం అనేక ప్రయోగాలు చేస్తారు. ఇందులో భాగంగానే మొన్న జరిగిన వెస్టిండీస్ వన్డే సిరీస్ కొత్త బౌలర్లకు అవకాశం ఇచ్చింది. అయితే దీనిపై కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వెధవకు టీమిండియాలో అవకాశం ఇస్తున్నారని.. దీని వల్ల ఏం ప్రయోజనం అంటూ నిలదీశారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. సీనియర్ బౌలర్లను వదిలేసి, తలా తోక తెలియని వాళ్ళని తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. కొత్త ఫాస్ట్ బౌలర్లను ఇప్పటినుంచి తయారు చేస్తే… వన్డే వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని బాంబు పేల్చారు. ఇప్పటికైనా సీనియర్ క్రికెటర్లను బరిలోకి దించాలని.. అప్పుడే టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇదంతా తెలియకుండా గౌతమ్ గంభీర్ బుర్ర తక్కువ పనులు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఈ త‌రుణంలోనే కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

గంభీర్ కు బుర్ర ఉందా? తలా తోక తెలియ‌ని బౌలర్లతో 2027 వరల్డ్ కప్ గెలవ‌లేం !

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మూడవ వన్డేలో మన బౌలర్లు విఫలం కావడంపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా 351 పరుగుల టార్గెట్ పెట్టిన కూడా ఓడిపోవడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శలు చేశారు. గురునూర్ బ్రార్, అన్షుల్ కంబోజ్ లాంటి యువ క్రికెటర్లను అసలు ఎందుకు ఆడిస్తున్నారని ప్రశ్నించారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అసలు గౌతం గంభీర్ కు బుర్ర ఉందా అంటూ నిలదీశారు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ కోసం బుమ్రాను అనవసరంగా పంపారని ఫైర్ అయ్యారు. జపాన్ గడ్డపై కేవలం స్పిన్ ట్రాక్ ఉన్న నేపథ్యంలో… బుమ్రా స్థానంలో మరో యంగ్ ఫాస్ట్ బౌలర్ను పంపినా సరిపోయేది అంటూ కౌంటర్ ఇచ్చారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ నేపథ్యంలో బలమైన టీమిండియా బౌలర్లను బరిలోకి దించాల్సిన విషయాన్ని మర్చిపోయి… ఈ సిరీస్ ను లైట్ తీసుకున్నారని ఫైర్ అయ్యారు. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు ఏ జట్టుతో వన్డేలు ఆడిన టీమిండియాకు చాలా ఉపయోగం అన్నారు. ఇప్పటికైనా గౌతమ్ గంభీర్ కండ్లు తెరవాలని ఫైర్ అయ్యారు.

ఆ నలుగురిని బరిలోకి దించండి

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటినుంచి టీమిండియా బౌలర్లను సాన పెట్టాలని కృష్ణమాచార్య శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ లాంటి బౌలర్లను 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేయాలని కోరారు. అప్పుడే టీమిండియా ఇరగదీస్తుందని సూచనలు చేశారు.

 

Related News

జై షా చేతుల మీదుగా గోల్డ్ మెడ‌ల్స్ తీసుకోవ‌డం ఇష్టం లేక, కావాల‌నే ఓడిపోయాం

వైభ‌వ్ ను ఏడిపించిన సైమ్ అయూబ్ కంట ప‌డితే, భార‌తీయులు తొక్కి చంపేస్తారు

టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

అభిషేక్, తిలక్ కాదు…శివం దూబే వల్లే టీమిండియాకు గోల్డ్ మెడల్

ఆ నలుగురు ఈగో గాళ్లను నీతా అంబానీ ఎలా భరిస్తాందో ?

గంభీర్ పీకిందేమీ లేదు…ఆ ఇద్దరి వల్లే 2026 టీ20 ప్రపంచ కప్

నాకు టీమిండియా బౌలర్లంటేనే అసహ్యం..అందుకే ఫైనల్స్‌లో చితకబాదాను

Big Stories

Advertisement
×