Shahid Afridi On IND VS PAK: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా పాకిస్తాన్ జట్టును టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియాకు గోల్డ్ మెడల్ దక్కింది. ఫైనల్స్ లో టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి, మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రతిసారి టీమిండియా చేతిలో ఓడిపోవడమేనా? ఏం పీకుతున్నారని పాకిస్తాన్ క్రికెటర్లపై ఆ దేశ మాజీలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
అయితే తాజాగా ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశారు. ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ సందర్భంగా గోల్డ్ మెడల్ ఇచ్చేందుకు ఐసీసీ జై షా వచ్చిన నేపథ్యంలోనే తాము కావాలని ఓడిపోయామని వ్యాఖ్యానించారు. జై షా కాకుండా మొహ్సిన్ నఖ్వీ లేదా ఇతర దేశస్తులు గెస్టులుగా వచ్చి ఉంటే.. ఫైనల్స్ లో తాము కచ్చితంగా గెలిచే వాళ్ళమని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయుల నుంచి ఎలాంటి ట్రోఫీలు తాము ఆశించడం లేదని… అందుకే ఫైనల్స్ ఓడిపోయినట్టు వ్యాఖ్యానించారు.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ఓడిపోవడం తనకు బాధ కలిగించిందని షాహిద్ అఫ్రిది వెల్లడించారు. కానీ ఓడిపోవడం… మంచిదే అయిందని వ్యాఖ్యానించారు. గోల్డ్ మెడల్ ఇచ్చేందుకు ఇండియాకు సంబంధించిన జై షా రావడంతోనే పాకిస్తాన్ క్రికెటర్లు అలర్ట్ అయినట్టు తెలిపారు. గెలిస్తే జై షా చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోవాల్సి వస్తుందని వాళ్లు గ్రహించారని వివరించారు. ఈ క్రమంలోనే టీమిండియా చేతిలో ఓడిపోయి పాకిస్తాన్ క్రికెటర్లు దేశభక్తి చాటుకున్నారని వ్యాఖ్యానించారు. టీమిండియా చేతిలో ఓడిపోయినందుకు పాకిస్తాన్ క్రికెట్లను ప్రశంసిస్తున్నట్లు వెల్లడించారు. పహల్గామ్ సంఘటన తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లకు.. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా టీమిండియా క్రికెటర్లు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని తాము ఓడిపోయినట్లు తలతిక్క సమాధానాలు చెప్పారు.
దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే పాకిస్తాన్ మాజీలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. టీమిండియాను ఓడించి గోల్డ్ మెడల్స్ సాధిస్తే బాగుండని అంటున్నారు. ఒకవేళ గోల్డ్ మెడల్ ఇచ్చేందుకు ఐసీసీ బాస్ జై షా వస్తే.. అతని ముఖాన కొడితే బాగుండు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో గోల్డ్ మెడల్ పై పాకిస్తాన్ మాజీలు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా 19 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును టీమిండియా ఓడించింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ సేన గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఆ మ్యాచ్ లో హసన్ నవాజ్ చివరి వరకు పోరాడిన కూడా.. ఫలితం దక్కలేదు.