Sunil Gavaskar Reaction On Vaibhav Suryavanshi: టీమిండియా యంగ్ స్టార్, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వైభవ్ సూర్యవంశీ, అతి తక్కువ కాలంలోనే టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియా ఆడే ప్రతి టీ20 సిరీస్ లో స్థానం దక్కించుకుంటున్నాడు వైభవ సూర్యవంశీ. అయితే, అలాంటి వైభవ్ సూర్య వంశీపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సీరియస్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు… ఫుడ్ తీసుకుంటే టీమిండియాలో అడుగుపెట్టడం కష్టమేనని హెచ్చరించారు. మొన్నటి వరకు ఒక లెక్క… ఇప్పుడు మరో లెక్క… పెళ్లి విషయంలో వైభవ్ సూర్య వంశీ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలా కాదని ఇష్టం వచ్చినట్లు తింటానంటే… కుదరదని హెచ్చరించారు. బరువు బాగా పెరిగితే, టీమిండియా నుంచి గెంటేస్తారని వార్నింగ్ ఇచ్చారు సునీల్ గవాస్కర్.
15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఫ్యామిలీ తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో మెరిసింది. ఈ ఫంక్షన్ కు వెళ్లిన వైభవ్ సూర్య వంశీ ఫ్యామిలీ.. చికెన్ బిర్యాని, మటన్, చేపలు ఇలా ఏవి కూడా వదలకుండా ఆరగించింది. అచ్చం కుంభకర్ణుడి లాగా వైభవ్ సూర్య వంశీ భోజనం చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఈ వీడియో చూసిన సునీల్ గవాస్కర్ చాలా సీరియస్ అయ్యారు. ఒరేయ్ వైభవ్… ఇప్పటి నుంచి ఇలా తింటే, టీమిండియా నుంచి నిన్ను తరిమి కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా లో ఛాన్స్ రావడమే నీకు అదృష్టం… అలాంటిది ఆ స్థానం నిలబెట్టుకోవాలంటే బ్యాటింగ్ తో పాటు… ఫిట్నెస్ చాలా ముఖ్యమై తెలిపారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తింటానంటే అస్సలు కుదరదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ లాగా కసితో, బయట ఫుడ్ తినడం మానేయాలని రిక్వెస్ట్ చేశారు. టీమిండియా తరఫున ఆడాలంటే రుచులు కోరుకోకూడదని వెల్లడించారు.
చాలాకాలం తర్వాత 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పైన మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. తాజాగా వైభవ్ పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీకి అసలు టెక్నిక్ లేదని పరువు తీశారు. గుడ్డిగా.. కళ్ళు మూసుకుని బ్యాట్ ఊపుతాడని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అతని కెరీర్ ఐదేళ్ల లోపే ముగుస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మూడు ఫార్మాట్లకు వైభవ్ సూర్య వంశీ అసలు పనికి రాబోవడని కూడా తెలిపారు. వైభవ్ విషయంలో టీమిండియా ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనవసరంగా అతనిపై అంచనాలు పెట్టుకోకూడదని రిక్వెస్ట్ చేశారు. 15 ఏళ్ల వయసులో టీమిండియాలోకి రావడం మాత్రం అతడి అదృష్టం అన్నారు. దాన్ని సరిగ్గా వాడుకుంటేనే.. సచిన్ తరహాలో అవుతాడని వివరించారు. దీంతో పనేసర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.