E-Paper
Advertisement

హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య వెనుక.. అనాథలైన కవలలు, గొడవలే అసలు కారణమా?

హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య వెనుక.. అనాథలైన కవలలు, గొడవలే అసలు కారణమా?
Advertisement

Hyderabad city: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం పెద్దలను సైతం ఎదురించారు. మరి ఆ దంపతుల మధ్య ఏం జరిగిందో తెలీదు. చివరకు ఆ టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? టెక్కీ సొంతూరు ఎక్కడ? అన్న డీటేల్స్ ఒక్కసారి చూద్దాం.

హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య వెనుక

వైజాగ్‌కు చెందిన రమాకాంత్- శ్రీకాకుళానికి చెందిన మౌనిక సంతోషి దంపతులు. మెడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని సంస్కృతి టౌన్‌షిప్ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి తన ఇంట్లో 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు సంతోషిగా గుర్తించారు పోలీసులు. ఆదివారం ఉదయం పని మనిషి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అందుకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు.

శ్రీకాకుళానికి చెందిన సంతోషిని, భర్త విశాఖ

Advertisement

సంతోషి భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. సంతోషి సొంతూరు శ్రీకాకుళం కాగా, ఆమె భర్త విశాఖకు చెందినవాడని సమాచారం. 8 ఏళ్ల వీరిద్దరు ప్రేమించు కున్నారు, ఆ తర్వాత పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండున్నరేళ్ల వయసున్న కవలలు ఉన్నారు. మరి దంపతుల మధ్య ఏం జరిగిందో తెలీదుగానీ, కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం తలుపులు తెరిచి ఉన్నాయి. పని మనిషి ఇంట్లోకి వెళ్లి చూడగా సంతోషిని ఉరి వేసుకున్న స్థితిలో కనిపించడంతో షాకైంది.

ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

Advertisement

పోలీసులకు సమాచారం ఇచ్చి, స్థానికుల సాయంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే టెక్కీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. సంతోషిని మృతికి భర్త వేధింపులు కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతి వెనుక కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Related News

కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ డ్రామాలు బంద్ చేయాలి- బండి సంజయ్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

చికెన్, మటన్ షాప్‌లో మీకు ఇలా జరిగిందా.. అయితే బీకేర్ ఫుల్!

జూరాల డ్యామ్‌ వద్ద ఉత్కంఠ.. రైతుల ధర్నాతో పోలీసులు పహారా!

మేం అధికారంలోకి వస్తే చేసే మొట్టమొదటి పని ఇదే.. కవిత క్లారిటీ..?

ఆలేరులో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన కీలక నాయకులు!

హోటళ్ల ముసుగులో ఓపెన్ బార్లు.. తూముకుంట దాబాల్లో ఏం జరుగుతోంది?

Big Stories

Advertisement
×