Sunil Gavaskar on Tilak Varma Run Out: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య నిన్న జరిగిన మూడవ టి20 సందర్భంగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (Tilak Varma run-out) వివాదాస్పదంగా రనౌట్ అయ్యాడు. బౌండరీ వెళ్లిందనుకొని కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో… మాస్టర్ మైండ్ ఉపయోగించిన విండీస్ ప్లేయర్లు అతడిని రన్ అవుట్ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar ) తన స్టైల్ లో స్పందించారు. ఇంకా స్కూల్ పిల్లాడిలా ప్రవర్తిస్తున్నావేంటి? అసలు నీకు బుర్ర ఉందా ? అంటూ ఫైర్ అయ్యారు. మైదానంలో నిద్రపోతున్నావా? అలాంటి రన్ అవుట్ కావడానికి సిగ్గుపడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar). దీంతో తిలక్ వర్మ రనౌట్ పై సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
వెస్టిండీస్ తో జరిగిన మూడవ టి20 సందర్భంగా తిలక్ వర్మ రనౌట్ పై (Tilak Varma run-out) సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. అసలు తిలక్ వర్మ ఏం పీకుతున్నాడు..? క్రీజులో బ్యాట్ పెట్టాలని తెలివి లేదా? బౌండరీలు గురించి తర్వాత ఆలోచించాలి… ముందు క్రీజులో బ్యాట్ పెట్టాలని చురకలు అంటించారు. ఆ మాత్రం తెలుసుకోకుండా తిలక్ వర్మ మైదానంలోనే నిద్రపోయాడటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సునీల్ గవాస్కర్. ఇలాంటి చిన్న తప్పిదాలే, మ్యాచ్ ఫలితాలను మార్చేస్తాయని ఆగ్రహించారు. ఇలాంటి రిపీట్ కావొద్దని హెచ్చరించారు.
ఇండోర్ వేదికగా జరిగిన మూడవ టి20 సందర్భంగా తిలక్ వర్మ 28 పరుగులతో మంచి టచ్ లో కనిపించాడు. అయితే కీలక సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి రన్ అవుట్ అయ్యాడు. వెస్టిండీస్ బౌలర్ మోటీ 17 ఓవర్ లో నాలుగవ బంతిని సంధించాడు. అక్షర్ పటేల్ (Axar Patel) స్ట్రైకింగ్ లో ఉండి లెగ్ సైడ్ వైపు ఆడాడు. అక్కడే ఉన్న కామిల్ పూరన్ డైవ్ చేసి బౌండరీ వెళ్లకుండా ఆపాడు. అయితే అది బౌండరీ వెళ్లిందనుకున్న తిలక్ వర్మ (Tilak Varma Run Out)… నిర్లక్ష్యంగా బౌలర్ ఎండ్ వైపు వెళ్ళాడు. కానీ అంతలోనే, బంతి అందిన మోటీ వికెట్లను గిరాటేశాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ రనౌట్ అయ్యాడు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రతీ కోచ్ క్రీజులో ఉండాలనే మొదట చెబుతారు.. కానీ ఈ విషయాన్నే తిలక్ వర్మ మరిచిపోయాడని మండిపడ్డారు.
𝐖𝐀𝐈𝐓, 𝐖𝐇𝐀𝐓 𝐉𝐔𝐒𝐓 𝐇𝐀𝐏𝐏𝐄𝐍𝐄𝐃?! 🤯
A near-boundary save turns into a run-out as the West Indies catch Tilak Varma short of his crease! #INDvWI 3rd T20I | LIVE NOW 👉 https://t.co/GmwwFjql5J pic.twitter.com/plCeyKV5SE
— Star Sports (@StarSportsIndia) October 11, 2026