Suresh Raina On Ms Dhoni: మహేంద్ర సింగ్ ధోని అంటే టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కు ఎంతో ఇష్టం అన్న సంగతి తెలిసిందే. అందుకే ధోని రిటైర్మెంట్ ఇచ్చిన వెంటనే సురేష్ రైనా కూడా అదే బాటలో నడిచి తన నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతలా ఈ ఇద్దరి మధ్య మంచి ఉండేది. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోని తరచూ తన బైక్స్ స్టేడియంలోనే ఎందుకు నడుపుతాడని విషయాన్ని బయటపెట్టారు సురేష్ రైనా. తనకు బైక్ నడపడం రాదని… అందుకే తనకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చినప్పుడు… మహేంద్ర సింగ్ ధోనీనే డ్రైవింగ్ చేస్తాడని వెల్లడించారు. తాను వెనకాల కూర్చొని… ధోని సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటానని పేర్కొన్నారు రైనా. ఇది తమ ఇద్దరికీ అలవాటేనని తెలిపారు. తనకు బైక్ రాగానే ధోని లాగేసుకొని మరి డ్రైవింగ్ చేస్తాడని తెలిపారు. మహేంద్ర సింగ్ ధోని కి డ్రైవింగ్ చేయడం, వాహనాలు కొనడం అన్న బాగా ఇష్టమని గుర్తు చేశారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి క్రికెట్ కంటే బైక్స్ అంటే ప్రాణమని సురేష్ రైనా వెల్లడించారు. బైక్స్ తో పాటు తన కార్లను ఒక పెద్ద బంగ్లాలోనే… మ్యూజియం లాగా ధోని పెట్టాడని వ్యాఖ్యానించారు. ఆ వాహనాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. వాటిని ఎంతో ప్రేమగా మహేంద్ర సింగ్ ధోని చూసుకుంటాడని.. పేర్కొన్నారు. కొత్తగా లాంచ్ అయిన ఏ బైక్ అయినా వెంటనే ధోనీనే కొనుగోలు చేస్తారని తెలిపారు. ఇక తనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ వచ్చినప్పుడు… బైక్ తీసుకొని గ్రౌండ్ మొత్తం చెక్కర్లు కొడదాం అంటూ తనను తీసుకు వెళ్లేవాడని గుర్తు చేసుకున్నారు సురేష్ రైనా. ఈ బైక్ రైడింగ్ తమ ఇద్దరి మధ్య బాండింగ్ పెంచిందని తెలిపారు.
2011 వన్డే వరల్డ్ కప్ రావడం వెనుక మహేంద్రసింగ్ ధోని కష్టం ఎంతో ఉందని సురేష్ రైనా గుర్తు చేశారు. ఎవరి క్రెడిట్ మహేంద్ర సింగ్ ధోని దొంగిలించలేదని తెలిపారు. ధోనియే ఎన్నో త్యాగాలు చేసి టైటిల్ తీసుకువచ్చాడని… గౌతమ్ గంభీర్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో ధోనిపై సురేష్ రైనా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.