E-Paper
Advertisement

కోమా నుంచి లేచిన మహిళ జీవితంలో గత ఆరు నెలలు మిస్సింగ్… భర్త కనిపించకపోవడంతో ట్విస్ట్… షాకింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

కోమా నుంచి లేచిన మహిళ జీవితంలో గత ఆరు నెలలు మిస్సింగ్… భర్త కనిపించకపోవడంతో ట్విస్ట్… షాకింగ్ సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Psychological thriller: సైకాలజీ నేపథ్యంతో సాగే ఒక మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చింది. స్టోరీ అయితే మామూలుగా ఉండదు. చూసే వాళ్ళకు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు వస్తూనే ఉంటాయి. కథలో కోమా నుంచి లేచిన ఓ మహిళకు తన జీవితంలోని గత ఆరు నెలలు గుర్తులేకపోతే ఎలా ఉంటుందో చూపిస్తూనే,   తన భర్త తనను చంపేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో  కథ మరో లెవెల్ కి వెళ్తుంది. ఈ మైండ్ గేమ్‌లతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ‘దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్’ (This Tempting Madness). జ్యామిఫర్ ఇ. మోంట్గోమెరీ దర్శకత్వంలో వచ్చిన ఈ అమెరికన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ క్లైమాక్స్ వరకు ఒక మిస్టరీగా సాగుతుంది.

స్టోరీలోకి వెళ్తే..  

కథ మియా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఒక తీవ్రమైన ప్రమాదంలో (ఎయిర్‌పోర్ట్ బాల్కనీ నుండి కిందపడి) మియా కోమాలోకి వెళ్తుంది. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో కన్నుతెరిచిన ఆమెకు, గత ఆరు నెలల జ్ఞాపకాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఆమె భర్త జేక్ ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించాడనే ఆరోపణతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు.

Advertisement

అయితే మియా తన భర్త జేక్ నిర్దోషి అని నమ్ముతుంది. కోమా నుంచి కోలుకుంటున్న సమయంలో, జేక్ అరెస్ట్ కావడం, ఆమె కుటుంబ సభ్యులు అతనికి వ్యతిరేకంగా మారడంతో పరిస్థితులు క్లిష్టంగా మారతాయి. తన సోదరుడు అజయ్ సహాయంతో మియా తన గతాన్ని, అసలు ఆ రాత్రి ఏం జరిగిందనే విషయాలను ముక్కలు ముక్కలుగా గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ఈ క్రమంలోనే జేక్‌కు ఉన్న తీవ్రమైన పారానోయా (మానసిక సమస్యలు), కుటుంబ రహస్యాలు, మియాలో ఉండే భ్రమలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అసలు మియాను బాల్కనీ నుండి తోసేసింది జేక్ ఏనా? లేక తన వినాశకరమైన చర్యలకు మియానే కారణమా? నిజం ఏంటి, భ్రమ ఏంటి అనే సైకలాజికల్ సస్పెన్స్‌తో ఈ సినిమా ముగుస్తుంది.

 ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

Advertisement

సిమోన్ యాష్లే, ఆస్టిన్ స్టోవెల్, సూరజ్ శర్మ, మోజీన్ అరియా, జెనోబియా ష్రాఫ్ తదితరులు నటించిన ‘దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్’కు జెన్నిఫర్ ఈ. మాంట్‌గోమరీ దర్శకత్వం వహించారు. ఇది నిజ ఘటనల నుంచి ప్రేరణ పొందిన సైకలాజికల్ థ్రిల్లర్.  ఈ సినిమా  2026 జూన్ 12న థియేటర్లలో విడుదలైంది.సెప్టెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix), లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఆపిల్ టీవీ (Apple TV) లలో ఇంగ్లీష్ ఆడియోతో అందుబాటులోకి వచ్చింది. మైండ్ గేమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వాళ్ళు మిస్ కాకూడని సినిమా ఇది.

Read Also: ఉద్యోగం కోసం ఇరాక్‌కు వెళ్లిన అమ్మాయి… ఊహించని పరిస్థితుల్లో ఉగ్రవాదుల చెరలో… నరాలు కట్టయ్యే సర్వైవల్ థ్రిల్లర్

Tags

Related News

మాఫియా సామ్రాజ్యాన్ని మట్టుబెడదాం అనుకుంటే మెంటల్ మాస్ షాక్… క్లాసిక్ క్రైమ్ డ్రామా

హార్వర్డ్ మేధావి వరుస బాంబు దాడులు… టెడ్ కాజిన్స్కీ వేట వెనుకున్న అసలు కథ… షాకింగ్ క్రైమ్ డ్రామా

పవర్‌ఫుల్ గురువుపై 17 ఏళ్ల అమ్మాయి షాకింగ్ ఆరోపణ… హై-టెన్షన్ కోర్ట్‌రూమ్ క్రైమ్ థ్రిల్లర్

మూడేళ్ల ప్రేమకు బ్రేకప్… ఎక్స్ పై రివెంజ్‌తో మతిపోగొట్టే పని… యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ

బాబోయ్ ఆ గుహలోకి వెళ్తే మాయమవుతారు… గర్భిణీ ఆత్మహత్య… మైండ్ బ్లోయింగ్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్

అడవిలో అరుదైన వింత కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్… కట్ చేస్తే మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్

ప్రేమకు అడ్డుగా మారిన ఊరి గొడవలు… తమిళనాడు బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామా

Big Stories

Advertisement
×