E-Paper
Advertisement

మాఫియా సామ్రాజ్యాన్ని మట్టుబెడదాం అనుకుంటే మెంటల్ మాస్ షాక్… క్లాసిక్ క్రైమ్ డ్రామా

మాఫియా సామ్రాజ్యాన్ని మట్టుబెడదాం అనుకుంటే మెంటల్ మాస్ షాక్… క్లాసిక్ క్రైమ్ డ్రామా
Advertisement

Mafia Crime Thriller: ఏళ్ల తరబడి మాఫియా ప్రపంచాన్ని నడిపిన మైఖేల్ కొర్లియోన్… చివరికి తన కుటుంబాన్ని ఆ నేర సామ్రాజ్యం నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. అయితే డబ్బు, అధికారం అన్నీ ఉన్నా… గతం మాత్రం అతన్ని వదిలి పెట్టదు. తన కుటుంబానికి ఓ కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్న మైఖేల్‌కు ఎదురైన చివరి పరీక్షలే ‘ది గాడ్‌ఫాదర్ కోడా: ది డెత్ ఆఫ్ మైఖేల్ కొర్లియోన్’ (The Godfather Coda: The Death of Michael Corleone). ఈ రీ-ఎడిటెడ్ వర్షన్ డిజిటల్‌గా విడుదలై మంచి రెస్పాన్స్ తో ఓటీటీలో దూసుకుపోతోంది.

కథలోకి వెళ్తే…

మైఖేల్ కొర్లియోన్ (Michael Corleone) తన జీవితంలో ఎన్నో నేరాలు చేసి కొర్లియోన్ కుటుంబాన్ని శక్తివంతమైన మాఫియా సామ్రాజ్యంగా మార్చాడు. కానీ వయసు పెరిగేకొద్దీ అతనిలో ఓ మార్పు వస్తుంది. ఇకపై తన కుటుంబాన్ని నేర ప్రపంచం నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. మాఫియా నుంచి పూర్తిగా బయటకు వచ్చి తన వ్యాపారాలను చట్టబద్ధం చేయాలని ప్రయత్నిస్తాడు. అందుకోసం కుటుంబ వ్యాపారాలను మరో స్థాయికి తీసుకెళ్లే భారీ డీల్స్‌ చేయాలని చూస్తాడు. కానీ మాఫియా ప్రపంచం నుంచి బయటపడటం అనుకున్నంత సులభం కాదు.

Advertisement

తన గతంలో ఏర్పడిన శత్రుత్వాలు, కుటుంబంలో జరిగిన విషాదాలు, తన నిర్ణయాల ప్రభావం… ఇవన్నీ మైఖేల్‌ను వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా తన కుమార్తె మేరీ (Mary)తో అతనికి ఉన్న అనుబంధం కథలో కీలకంగా మారుతుంది. మరోవైపు కొర్లియోన్ కుటుంబానికి చెందిన కొత్త తరం కూడా నేర ప్రపంచం, వ్యాపార ప్రపంచం మధ్య తమ స్థానాన్ని వెతుక్కుంటుంది. మైఖేల్ తన కుటుంబాన్ని చట్టబద్ధమైన జీవితంలోకి తీసుకురావాలని చూస్తున్నా… అతని చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం అతన్ని మళ్లీ పాత దారిలోకి లాగుతూనే ఉంటుంది. చివరికి తన గతాన్ని పూర్తిగా చెరిపేసి కుటుంబానికి ప్రశాంతమైన జీవితం ఇవ్వగలడా? తన పాపాలకు పరిహారం పొందే అవకాశం అతనికి దొరుకుతుందా? మైఖేల్ కొర్లియోన్ జీవితానికి ఎలాంటి ముగింపు ఎదురైంది? అనే ప్రశ్నల చుట్టూ ఈ క్లాసిక్ క్రైమ్ డ్రామా సాగుతుంది.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

ఇది 1990లో వచ్చిన ‘ది గాడ్‌ఫాదర్ పార్ట్ III’కి రీ-ఎడిటెడ్ వెర్షన్. అల్ పాసినో, డయాన్ కీటన్, టాలియా షైర్, ఆండీ గార్సియా, సోఫియా కొప్పోలా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా దర్శకత్వం వహించారు.  ఈ రీ-ఎడిటెడ్ వర్షన్ 2020 డిసెంబర్ 4న పరిమిత థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ (Apple TV) ప్లాట్‌ఫామ్‌లలో ఇంగ్లీష్ ఆడియో మరియు తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also: అడవిలో అరుదైన వింత కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్… కట్ చేస్తే మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్

Related News

కోమా నుంచి లేచిన మహిళ జీవితంలో గత ఆరు నెలలు మిస్సింగ్… భర్త కనిపించకపోవడంతో ట్విస్ట్… షాకింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హార్వర్డ్ మేధావి వరుస బాంబు దాడులు… టెడ్ కాజిన్స్కీ వేట వెనుకున్న అసలు కథ… షాకింగ్ క్రైమ్ డ్రామా

పవర్‌ఫుల్ గురువుపై 17 ఏళ్ల అమ్మాయి షాకింగ్ ఆరోపణ… హై-టెన్షన్ కోర్ట్‌రూమ్ క్రైమ్ థ్రిల్లర్

మూడేళ్ల ప్రేమకు బ్రేకప్… ఎక్స్ పై రివెంజ్‌తో మతిపోగొట్టే పని… యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ

బాబోయ్ ఆ గుహలోకి వెళ్తే మాయమవుతారు… గర్భిణీ ఆత్మహత్య… మైండ్ బ్లోయింగ్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్

అడవిలో అరుదైన వింత కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్… కట్ చేస్తే మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్

ప్రేమకు అడ్డుగా మారిన ఊరి గొడవలు… తమిళనాడు బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామా

Big Stories

Advertisement
×