E-Paper
Advertisement

Tanveer Ahmed: టీమిండియా కోచ్ గా ప‌నిచేయాల‌ని నా కాళ్లు ప‌ట్టుకున్నారు..కానీ నేనే ఛీ కొట్టా

Tanveer Ahmed: టీమిండియా కోచ్ గా ప‌నిచేయాల‌ని నా కాళ్లు ప‌ట్టుకున్నారు..కానీ నేనే ఛీ కొట్టా
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ పైన అనేక రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. టీమిండియా తో పాటు ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ లు అన్ని కూడా ఫిక్సింగ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మ‌ద్ ( Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కోచ్ గా తనకు చాలా సార్లు అవకాశం వచ్చిందని.. అయితే తాను మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని వెల్లడించారు. లేకపోయి ఉంటే నేను టీమిండియా కోచ్ అయ్యే వాడినని తెలిపారు తన్వీర్ అహ్మ‌ద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read: Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

టీమిండియా కోచ్ గా ప‌నిచేయాల‌ని నా కాళ్లు ప‌ట్టుకున్నారు

Advertisement

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో టీమిండియా ప్లేయర్లు బిజీగా ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మ‌ద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. టీమిండియా బౌలింగ్ కోచ్ గా పని చేయాలని కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలిపారు. బౌలింగ్ కోచ్‌ తో పాటు మెయిన్ కోచ్ గా కూడా పనిచేయాలని తనను కోరారని తన్వీర్ అహ్మ‌ద్ బాంబు పేల్చారు. అయితే తనకు ఇండియాకు వర్క్ చేయడం ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. శత్రు దేశానికి సేవలు చేయడం తనకు అస్సలు ఇష్టం లేదని స్పష్టం చేశారు తన్వీర్ అహ్మ‌ద్. తన కాళ్లు పట్టుకున్న కూడా టీమిండియా కు కోచ్ గా వెళ్లబోనని వెల్లడించారు. ఈ ఆఫర్ వచ్చినప్పుడు ముఖం మీదే చెప్పి బయటకు పంపించానని బీసీసీఐపై ( BCCI) సంచలన ఆరోపణలు చేశారు తన్వీర్ అహ్మ‌ద్. దీతో తన్వీర్‌ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా కోచ్ లుగా గంభీర్‌, మోర్కెల్

టీమిండియా హెడ్ కోచ్ గా ప్రస్తుతం గౌతమ్ గంభీర్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా బౌలింగ్ మోర్నే మోర్కెల్ పనిచేస్తున్నాడు. ఇద్దరు కోచ్ లు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగే ఛాన్సులు ఉన్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత ఈ ఇద్దరు రాజీనామా చేస్తారని అంటున్నారు. అప్పటివరకు వీళ్లే కోచ్ లుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ కు లేదా మహేంద్రసింగ్ ధోనీకి అవకాశం వస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisement

Also Read: Lalit Modi-Goenka: సంజీవ్ గోయెంకా దుర్మార్గుడు, వాడిపై బ్యాన్ వేయాలి..పంత్ కాళ్లు మొక్కే దాకా వ‌ద‌లొద్దు

 

https://www.facebook.com/story.php?story_fbid=969885295952213&id=100087922547709&rdid=S6zZtgu4jLlFdWtL#

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×