E-Paper
Advertisement

యమహా ధరలు పెంపు, కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే?

యమహా ధరలు పెంపు, కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే?
Advertisement

Yamaha Raises Aerox 155 Prices Hiked: యమహా వినియోగదారులకు షాకిచ్చే నిర్ణయం తీసకుంది. భారతీయ మార్కెట్ లో తన పాపులర్ స్కూటర్ మోడల్స్ అయిన ఏరాక్స్ 155, ఏరాక్స్ 155 వెర్షన్ S ధరలను స్వల్పంగా పెంచింది. ఈ రెండు వేరియంట్లపై ఒక్కొక్కదానికి రూ. 620 చొప్పున ధర పెరిగింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో పాటు ముడిసరుకు ధరలు, రవాణా ఖర్చులు పెరగడం లాంటి కారణాలతో ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ చిన్న పెరుగుదల వల్ల కొనుగోలుదారుల నిర్ణయంపై పెద్దగా ప్రభావం ఉండదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మెకానికల్ గా నో ఛేంజెస్

ధరలు పెరిగినా, స్కూటర్‌ లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఏరాక్స్ 155, వెర్షన్ S రెండూ కూడా అదే 155cc లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ తోనే కొనసాగుతున్నాయి. ఈ ఇంజన్ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్(VVA) టెక్నాలజీతో పనిచేస్తూ సుమారు 14.7 bhp పవర్, 13.9 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. పనితీరు పరంగా ఎలాంటి తేడా లేకుండా యథాతథంగా కొనసాగుతోంది.

ఏరాక్స్ 155 ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే, ఏరాక్స్ 155లో సాధారణంగా నెగటివ్ LCD డిస్‌ ప్లే ఉంటుంది. ఇది స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీతో వస్తుంది.  కాల్స్, SMS, ఈమెయిల్ అలర్ట్స్ లాంటి నోటిఫికేషన్లు స్క్రీన్‌ పై చూసే అవకాశం ఉంటుంది. అలాగే, ఈ స్కూటర్‌ లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది.  ఈ తరహా ఫీచర్ 155cc స్కూట ర్‌కు అంతగా అవసరం ఉండకపోవచ్చు. మరోవైపు, ఏరాక్స్ 155 వెర్షన్ Sలో కూడా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. దీని ప్రత్యేకత స్మార్ట్ కీ ఫీచర్. ఈ స్మార్ట్ కీ వల్ల స్కూటర్‌ను కీ పెట్టకుండానే స్టార్ట్ చేయవచ్చు. ఇది రోజువారీ వినియోగంలో చాలా సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా నగర ప్రయాణాల్లో ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది.

త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్ లోనూ..

యమహా ఈ మోడల్‌ ను ఎలక్ట్రిక్ వెర్షన్‌ లో కూడా తీసుకురావాలని ఆలోచిస్తోంది.  యమహా ఏరాక్స్ ఇ  అనే పేరుతో ఈ స్కూటర్‌ ను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Read Also: స్కూటర్‌ లో ఎయిర్‌ బ్యాగ్.. యమహా టెక్నాలజీ అదిరింది గురూ!

కంపెనీ తాజా నిర్ణయంతో ధరల్లో చిన్న పెరుగుదల ఉన్నప్పటికీ, యమహా ఏరాక్స్ 155 తన స్టైల్, పనితీరు, ఆధునిక ఫీచర్లతో ఇప్పటికీ మంచి ఎంపికగా నిలుస్తోంది. కొత్త ధరలతో కూడా ఈ స్కూటర్ మార్కెట్లో తన స్థానాన్ని అలాగే కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోంది.

Read Also: ఓలా వెనుకబాటు, ఏథర్ ముందడుగు.. ఈవీ రంగంలో కొత్త పోటీ!

Related News

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

Big Stories

Advertisement
×