E-Paper
Advertisement

BYD చౌకైన ఈవీ వచ్చేస్తోంది.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!

BYD చౌకైన ఈవీ వచ్చేస్తోంది.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
Advertisement

Affordable BYD EV: చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD భారత మార్కెట్లో మరింత సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లతో గుర్తింపు పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ SUVని తీసుకురావాలని భావిస్తోంది. BYD అట్టో 2 పేరుతో రానున్న ఈ మోడల్ భారత్ లో కంపెనీకి అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వెహికల్ గా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో BYD నుంచి అట్టో 3, సీల్, e6, సీలియన్ 7 లాంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవన్నీ ఎక్కువగా ప్రీమియం సెగ్మెంట్స్ లో  ఉండటంతో సాధారణ కొనుగోలుదారులు ఖరీదైనవిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అట్టో 2ను తక్కువ ధరలో తీసుకురావడం ద్వారా మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలని కంపెనీ భావిస్తోంది.

పాపులర్ మోడళ్లకు గట్టి పోటీ

రాబోయే BYD అట్టో 2, దేశంలో మంచి ఆదరణ పొందిన మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో పోటీ పడనుంది. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా సియెర్రా EV, మహీంద్రా BE 6 వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు.  అట్టో 2 పొడవు సుమారు 4.3 మీటర్లు ఉంటుంది. ఇది అట్టో 3 కంటే కొద్దిగా చిన్నదే అయినప్పటికీ, SUV తరహా డిజైన్‌ తో విశాలమైన క్యాబిన్‌ను అందించేలా రూపొందించారు.  కుటుంబ అవసరాలకు అనువుగా ఉండే ఇంటీరియర్ లేఅవుట్ కూడా ఇందులో ఉండనుందని సమాచారం.

ధర ఎంత అంటే?

Advertisement

BYD అట్టో 2 రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇదే నిజమైతే, కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న అట్టో 3 కంటే ఇది చాలా తక్కువ ధరలో లభించే మోడల్ అవుతుంది. ప్రీమియం అనుభూతితో పాటు సరసమైన ధర కోరుకునే కొనుగోలుదారులకు ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది. అయితే,  దేశంలో ఈ SUVని పూర్తిగా తయారు చేయకుండా, దిగుమతి చేసుకున్న కిట్లను ఇక్కడ అసెంబుల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీని వల్ల ధర నిర్ణయంలో కంపెనీకి కొన్ని పరిమితులు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో BYD అట్టో 2ను పలు బ్యాటరీ, మోటార్ ఎంపికలతో విక్రయిస్తోంది. ఇందులో 94 hp, 174 hp, 201 hp సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే 32 kWh, 45.12 kWh, 51.1 kWh, 64.8 kWh LFP బ్యాటరీ ప్యాక్‌లను కూడా అందిస్తోంది. టాప్ వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 430 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. అయితే భారత మార్కెట్లో ఏ బ్యాటరీ వేరియంట్లు అందుబాటులోకి వస్తాయన్న విషయంపై ఇంకా అధికారిక సమాచారం లేదు.

Advertisement

Read Also: ఏథర్ కొత్త స్కూటర్‌కు ‘కోనార్క్’ పేరు ఎందుకు? అసలు విషయం చెప్పిన సీఈఓ మెహతా!

Tags

Related News

కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు!

టాటా To కియా.. రూ.20 లక్షల్లోపు బెస్ట్ సౌండ్ సిస్టమ్ కార్లు ఇవే!

టియాగో ఈవీ To విండ్సర్ ఈవీ.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

ఏథర్ కొత్త స్కూటర్‌కు ‘కోనార్క్’ పేరు ఎందుకు? అసలు విషయం చెప్పిన సీఈఓ మెహతా!

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రాండ్ ఎంట్రీ, జస్ట్ రూ. లక్షకే కొత్త ఫ్యామిలీ ఈవీ!

కొనుగోలుదారులకు టీవీఎస్ షాక్.. ఐక్యూబ్ సహా పలు స్కూటర్ల ధరలు భారీగా పెంపు!

ఇదేందయ్యా ఇది.. స్కూటీ రేటు రూ.లక్ష.. పెండింగ్ చలాన్లు మాత్రం రూ.10 లక్షలు!

Big Stories

Advertisement
×