E-Paper
Advertisement

ఫైన‌ల్స్ లో అదే జ‌రిగితే…పాకిస్తాన్ గ‌ల్లీల్లో టీమిండియా దిష్టి బొమ్మ త‌గ‌ల‌బెడ‌తా !

ఫైన‌ల్స్ లో అదే జ‌రిగితే…పాకిస్తాన్ గ‌ల్లీల్లో టీమిండియా దిష్టి బొమ్మ త‌గ‌ల‌బెడ‌తా !
Advertisement

Tanveer Ahmed on India vs Pakistan Asian Games clash:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య శనివారం అంటే అక్టోబర్ మూడవ తేదీన ఫైనల్స్ జరగనుంది. గోల్డ్ మెడల్ కోసం జరగబోతున్న ఈ ఫైట్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైనల్స్ లో టీమిండియాను ఓడించే అద్భుతమైన అవకాశం పాకిస్తాన్ కు వచ్చిందని వెల్లడించారు. ఫైనల్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తే… టీమిండియా దిష్టిబొమ్మను పాకిస్తాన్ వీధుల్లో దగ్ధం చేస్తామని సంచలన కామెంట్స్ చేశారు. బలమైన టీమిండియాను యంగ్ పాకిస్తాన్ ఓడిస్తుందని తనకు అంచనా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

టీమిండియాను ఓడించండి… లాహోర్ లో సంబరాలు చేసుకుందాం

ఏషియన్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ పై తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫర్హాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈసారి టీమిండియాను ఓడిస్తుందని తనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్లేయర్ లందరూ యువకులేనని.. బంగ్లాదేశ్ పైన వీళ్లే విజయం సాధించినట్లు గుర్తు చేశారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

ఫైనల్స్ నేపథ్యంలో టీమిండియా కూడా చాలా బలంగానే ఉంది.. అలాంటి జట్టు పైన ఫర్హాన్ సారథ్యంలోని పాకిస్తాన్ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం తనకు ఉందన్నారు. ఈసారి టీమిండియాను ఓడిస్తే… ఈ విజయం పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలుస్తుందని ప్రకటించారు. పూర్తి స్థాయి సభ్యులతో టీమిండియా బరిలోకి దిగితే… బచ్చాగాళ్లు ఫైనల్ ఆడబోతున్నట్లు తెలిపారు.

జపాన్ గడ్డపై టీమిండియా ఆడడం కష్టమే

Advertisement

ఫ్లాట్ ట్రాక్స్ పైన ఇరగదీసే టీమిండియా క్రికెటర్లు జపాన్ గడ్డపై ఆడడం కష్టమేనని బాంబు పేల్చారు తన్వీర్ అహ్మద్. జపాన్ లో మైదానాలు అన్ని స్పిన్ కు అనుకూలిస్తున్నాయని తెలిపారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా టీమిండియా క్రికెటర్లు ఎవరు కూడా పెద్దగా రాణించలేదని గుర్తు చేశారు.

ఇషాన్ కిషన్ కూడా గుడ్డిగా షాట్లు ఆడాడని బాంబు పేల్చారు. టీమిండియా బౌలర్లు రాణించడంతో బతికి బయటపడ్డారు తప్ప… శ్రేయస్ అయ్యర్ సేన పీకింది ఏమీ లేదని పరువు తీశారు. రేపు పాకిస్తాన్ చేతిలో కూడా టీమిండియా ఓడిపోబోతుందని హెచ్చరించారు. కాగా శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్స్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన వాళ్ల‌కు గోల్డ్ మెడ‌ల్ కానుంది.

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Related News

ఒకటి కాదు రెండు కాదు.. టీమిండియా, పాకిస్తాన్ మ‌ధ్య 6 మ్యాచ్ లు, ఇదిగో షెడ్యూల్

రఘు లేకుంటే, టీమిండియా సంకనాకి పోయేది… విరాట్ కోహ్లీ సంచలనం!

మురళీధరన్ కుట్ర వ‌ల్ల‌..గారీ క్రిస్టెన్ న‌న్ను బండ బూతులు తిట్టాడు

సైమ్ అయూబ్ తో జాగ్ర‌త్త‌, టీమిండియా తాట తీస్తాడు…ర‌మీజ్ రాజా హెచ్చ‌రిక‌

కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చుతున్నాం..కానీ గిల్‌కు కూడా మనోడు సరిపోవడం లేదు

0,0,0,0,0 ఐదుగురు డకౌట్స్…లంక ఓటమి, ఫైనల్స్‌కు దూసుకెళ్లిన టీమిండియా

ఒరేయ్ దద్దమ్మ… ఫ్లాట్ ట్రాక్స్‌పై తప్ప, విదేశీ పిచ్‌లపై ఇంకెప్పుడు ఆడతావ్ ?

Big Stories

Advertisement
×