Tanveer Ahmed on Vaibhav: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) ఇప్పుడిప్పుడే టీం ఇండియాలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) వైభవ్ అదరగొట్టాడు. సెంచరీలు అలాగే అర్థ సెంచరీలు నమోదు చేసి తోపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లకు వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ సెలెక్ట్ చేసింది. అయితే, ఐర్లాండ్ తో జరిగిన టి20 సీరియస్ సందర్భంగా వైభవ్ కు అవకాశం రాలేదు.. కానీ ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ నుంచే వైభవ్ ఆడతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోసారి చెబుతున్నా… వైభవ్ వయస్సు 15 సంవత్సరాలు కాదని… వాడి వయసు 20 నుంచి 22 సంవత్సరాలు ఉంటుందని ఆరోపణలు చేశారు. ఇదంతా కావాలనే టీమిండియా, బీసీసీఐ దాస్తోందని మండిపడ్డారు. బాబర్ ఆజం రికార్డులను బద్దలు కొట్టేందుకే.. ఈ కుర్రాడి వయసు దాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైభవ్ పై తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో అతడి ఆత్మవిశ్వాసం పై దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్య వంశీ వయస్సు 15 సంవత్సరాలు కాదని మరోసారి ఆరోపణలు చేశారు. అతని వయసుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పుడే అసలు రంగు బయట పడుతుందని బాంబు పేల్చాడు. బాబర్ ఆజం అతి తక్కువ వయస్సులోనే అనేక రికార్డులు క్రియేట్ చేశాడని తెలిపారు. అయితే ఆ రికార్డులను బద్దలు కొట్టేందుకు వైభవ్ సూర్యవంశీ వయస్సు తక్కువగా చెబుతున్నారని బిసిసిఐపై ఆరోపణలు చేశారు. దీనిపై కచ్చితంగా విచారణ జరగాల్సిందే అని కుండబద్దలు కొట్టి చెప్పారు.
ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (IND VS IRE) మధ్య జరిగిన టి20 సిరీస్ నేపథ్యంలో వైభవ్ ఆడి ఉంటే, శ్రేయస్ అయ్యర్ సేన గెలిచేదని చాలామంది ప్రచారం చేస్తున్నారు. అయితే దీన్ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ఖండించారు. అదంతా ఫేక్ అని.. అందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. వైభవ్ సూర్య వంశీ తుది జట్టులో ఉన్నప్పటికీ కూడా టీమిండియా గెలిచేది కాదన్నారు.