E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

GHMC Engineers: జీహెచ్ఎంసీలో భారీ షాక్.. హెచ్ సిటీ ప్రాజెక్టుకు బ్రేక్..!

GHMC Engineers: జీహెచ్ఎంసీలో భారీ షాక్.. హెచ్ సిటీ ప్రాజెక్టుకు బ్రేక్..!
Advertisement

GHMC Engineers: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఇప్పటికే ఇంజనీర్ల కొరత కొనసాగుతుండగా, తాజాగా ఒకే రోజు ముగ్గురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు రిటైర్డు అయ్యారు. దీంతో మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటికే అభివృద్ది, మెయింటనెన్స్ పనులపై ప్రభావం పడగా, తాజాగా ముగ్గురు సూపరింటెండెంట్ ఇంజనీర్లతో పాటు ఒక్క జీహెచ్ఎంసీలోని వివిధ హోదాలకు సంబంధించి ఒకే రోజు 35 మంది ఉద్యోగులు రిటైర్డు అయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ. 7 వేల కోట్ల వ్యయంతో 5 ప్యాకేజీలుగా 23 ప్రాజెక్టుల పనులతో రూపొందించిన హెచ్ సిటీ పనులు ఎలా ముందుకు సాగుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు సూపరింటెండెంట్ ఇంజనీర్లలో ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ కు సర్కారు ఎక్స్ టెన్షన్ ఇచ్చినట్లు ప్రచారం కూడా జరుగుతుంది.

సర్కారు మానస పుత్రిక..

మూడు కార్పొరేషన్లలో అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో హెచ్ సిటీ పనులను పట్టాలెక్కించిన మరో సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా వచ్చే నెలాఖరుతో రిటైర్డు కానున్నారు. నగరంలో పెరుగుతున్న రద్దీ, ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, గ్రేడ్ సెపరేటర్లు వంటి ప్రాజెక్టులతో ప్రతిపాదించి, ఆమోదించిన సర్కారు మానస పుత్రిక అయిన హెచ్ సిటీ పనులు ఎలా ముందుకు సాగుతాయంటూ ఇంజనీరింగ్ వింగ్ లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్ నుంచి మొదలుకుని ప్రధాన కార్యాలయం ఆవసరాల మేరకు అసిస్టెంట్ ఇంజనీర్ మొదలుకుని, చీఫ్ ఇంజనీర్ వరకు మొత్తం 210 మంది అవసరముండగా, ప్రస్తుతం కనీసం వంద మంది ఇంజనీర్లు కూడా లేరు. పైగా ఉన్న ఇంజనీర్లలో ఒక్కోక్కరికి నాలుగేసి బాధ్యతలను అప్పగించటంతో ఇంజనీర్లు ఏ బాధ్యతను సక్రమంగా నిర్వహించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంజనీర్ విభాగంలో..

Advertisement

జీహెచ్ఎంసీలోని ఇంజనీర్లతో కలిపి ఒకే రోజు మొత్తం 35 మంది రిటైర్డు కావటంతో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య మూడు వేలకు పడిపోయింది. రిటైర్డు అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవటం, ఆ విధులు ఔట్ సోర్స్ ఉద్యోగులు గానీ, మరో పర్మినెంట్ ఉద్యోగి అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. దీంతో ఇంజనీర్ విభాగంలో ఇంజనీర్ల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు ఇంజనీర్లు ఇక్కట్లు పడుతుండగా, మొత్తం జీహెచ్ఎంసీలో ప్రతి నెల ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటంతో, ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయి.

Also read: వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

పెండింగ్ లో స్టాఫ్ ప్యాట్రన్ ప్రతిపాదన

Advertisement

కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను గత నవంబర్ 25వ తేదీన విలీనం చేసిన తర్వాత పెరిగిన జీహెచ్ఎంసీ పరిధిని గత ఫిబ్రవరి 11 నుంచి పునర్ వ్యవస్థీకరించి మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు తమకు కావల్సిన సిబ్బంది వివరాలతో సర్కారుకు స్టాఫ్ ప్యాట్రన్ ప్రతిపాదనలను పంపించాయి. వీటిని సర్కారుకు సమర్పించి నాలుగు నెలలు గడుస్తున్నా, సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మూడు కార్పొరేషన్లలో అవసరాలకు తగిన విధంగా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ వంటి వింగ్ లలో అధికారులు, సిబ్బంది లేకపోవటంతో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మూడు కార్పొరేషన్లలోని కొన్ని విభాగాలకు చెందిన అధికారులైతే తాము ఇంకా ఇక్కడ పని చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.

ఇంకెన్నీ రోజులు పెండింగ్ లో సర్కారు ఆదేశాలు

గత మే మాసం చివరలో దాదాపు 30 మంది పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లలో కొందరికి పదోన్నతులు, మరి కొందరికి ప్రమోషన్ కమ్ ట్రాన్స్ ఫర్ వంటివి చేపడుతూ సర్కారు జీవో నెంబర్ 575 ను జారీ చేసింది. కానీ ఈ ఆదేశాల్లో ఇప్పటికే సస్పెన్షన్ కు గురైన మరో ఇంజనీర్ కు కూడా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ కావటంతో ఈ పదోన్నతులు, బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ బదిలీల్లో భాగంగా పబ్లిక్ హెల్త్ నుంచి పది మంది ఇంజనీర్లను జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. ఈ ఆదేశాలను ఉన్నతాధికారులు అక్రమాలు వెలుగుచూసిన నాటి నుంచి అమలు చేయకుండా, సవరణ కోసం సర్కారుకు పంపకుండా పెండింగ్ లోనే ఉంచారు. మరో వైపు ఇంజనీర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ మెయింటనెన్స్, ప్రాజెక్టు పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది.

Also read: ఎన్టీఆర్ కొత్త సినిమా పోస్టర్‌పై చెలరేగుతున్న వివాదం… ఇంతకీ మురుగన్ పుట్టింది ఎక్కడ ?

Related News

మాట ఇచ్చి మర్చిపోయారా.. సిగాచి బాధితుల కన్నీళ్లపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఫైర్!

దమ్ముంటే రాజీనామా అంటారా? నీ అయ్య జాగీరా? నిప్పులు చెరిగిన సీఎం రేవంత్

ఎయిర్‌పోర్టు నుంచి నిధుల వరకు… కేంద్రం సమాధానం చెప్పాలి- మంత్రి పొన్నం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట.. కేసులు కొట్టివేసిన కోర్టు!

రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!

SIR భాష వివాదం.. హైకోర్టులో ఆసక్తికర వాదనలు.. ఈసీకి జడ్జి సూటి ప్రశ్న!

Singareni CathLab: సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ గిఫ్ట్..!

Big Stories

×