E-Paper
Advertisement

జింబాబ్వేపై కాదురా బుడ్డోడా, ద‌మ్ముంటే పాకిస్తాన్ పై సెంచ‌రీ చేసి చూపించు

జింబాబ్వేపై కాదురా బుడ్డోడా, ద‌మ్ముంటే పాకిస్తాన్ పై సెంచ‌రీ చేసి చూపించు
Advertisement

Tanveer Ahmed on Vaibhav : ఇండియా వర్సెస్ జింబాబ్వే (Zimbabwe vs India) మధ్య టి20 సిరీస్ (India tour of Zimbabwe 2026) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టీ20 సిరీస్ నేపథ్యంలో హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ (Harare Sports Club, Harare) వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు ఏడు మ్యాచ్ ల‌ తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా తొలి విక్టరీ అందుకుంది. అంతేకాదు 15 ఏళ్లకు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) 18 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ లాంటి దిగ్గజాల రికార్డు బద్దలు కొట్టాడు. అయితే జింబాబ్వేపై అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) కూడా లేటెస్ట్ గా రియాక్ట్ అయ్యాడు. జింబాబ్వేపై కాదురా బుడ్డోడా, ద‌మ్ముంటే పాకిస్తాన్ పై సెంచ‌రీ చేసి చూపించు అంటూ స‌వాల్ విసిరారు త‌న్వీర్ అహ్మ‌ద్. మామై సెంచ‌రీ చేస్తే, దేనికి రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

జింబాబ్వేపై కాదురా బుడ్డోడా, పాకిస్తాన్ పై సెంచ‌రీ చేసి చూపించు

Advertisement

జింబాబ్వే పైన 18 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని కించపరిచేలా పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) మరోసారి రెచ్చిపోయాడు. జింబాబ్వే గడ్డపై కూడా ఐపీఎల్ లాంటి హైవే పిచ్ లు తయారుచేసినట్లు బాంబు పేల్చారు. దీని వెనుక ఐసీసీ కుట్రలు చేసిందని బాంబు పేల్చారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ లాంటి జ‌ట్ల చేతిలో టీమిండియా ఓట‌మి పాలైంద‌ని గుర్తు చేశారు.

ఈ క్రమంలో టీమిండియా పరువు కాపాడేందుకు ఐసీసీ అలాగే బీసీసీఐ కుమ్మక్కు అయినట్లు బాంబు పేల్చారు. జింబాబ్వే క్రికెట్ బోర్డు తో మాట్లాడి ఫ్లాట్ మైదానాలు ఉండేలా చూసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే నిన్నటి మ్యాచ్ లో ఇండియన్ క్రికెటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలిగారని వెల్లడించారు. టీమిండియా బౌలింగ్ విభాగంలో కూడా అనామక ఆటగాళ్లు మాత్రమే ఉన్నారని.. అయినప్పటికీ అద్భుతంగా రాణించడం వెనుక కుట్రకోణం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై విచార‌ణ జ‌రుగాల‌ని డిమాండ్ చేశారు.

దమ్ముంటే పాకిస్తాన్ పై సెంచరీ చెయ్

Advertisement

జింబాంబే పై అర్థ సెంచరీ నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరారు తన్వీర్ అహ్మద్. పసికూన జింబాబ్వే పై రెచ్చిపోవడం కాదు… దమ్ముంటే పాకిస్తాన్ పై సెంచరీ చేయాలని ఛాలెంజ్ విసిరారు. పాకిస్తాన్ బౌలర్లను తట్టుకోవడం వైభవ్ వల్ల కాదని హెచ్చరించారు. తమ బౌలర్ల దెబ్బకు వైభవ్ డ‌కౌట్ అవుతాడని హేళన చేశారు.

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

Related News

న‌న్ను కొనేందుకు ఫిక్స‌ర్ వ‌స్తే..హోట‌ల్ రూంలోనే చిత‌క‌బాదాను

టీమిండియాకు ప్లాట్ పిచ్ లు..పాకిస్తాన్ కు క‌ఠిన‌మైన పిచ్ లా ? ఇంగ్లండ్ పై ఫైర్‌

పాకిస్తాన్ ప్లేయ‌ర్ కు బూట్లు అమ్ముకుంటోన్న విరాట్ కోహ్లీ?

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు

మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో మ‌ట్టి కొట్టిన బీసీసీఐ…ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ కు జై షా !

2017లో విరాట్ కోహ్లీని చూసి ప్యాంట్ త‌డుపుకున్నా..అమీర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వాహాబ్ రియాజ్…మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

Big Stories

Advertisement
×