Tanveer Ahmed: 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్, శ్రీలంక వేదికగా సెంచరీలు కొట్టడం కాదని.. దమ్ముంటే ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోవాలని హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో జరగబోయే ఇంగ్లాండు టీ20 సిరీస్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi ) సెంచరీ చేస్తే… తాను బట్టలు లేకుండా లాహోర్ వీధుల్లో తిరుగుతానని శపథం చేశారు. ఇంగ్లాండ్ పై వైభవ్ సెంచరీ సాధిస్తే, తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ విసిరారు. ఇంగ్లాండు గడ్డపై ( England) కూడా అద్భుతంగా వైభవ్ సూర్యవంశీ రాణిస్తే, అతనిపై ఇక విమర్శలు చేయబోనని వెల్లడించారు తన్వీర్ అహ్మద్. దీంతో వైభవ్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇంగ్లాండ్ ( England Vs Team India T20 ) సిరీస్ కోసం సిద్ధమవుతున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi ) మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్య వంశీ 15 సంవత్సరాలు లేడని.. అతని వయసు 22 సంవత్సరాలు ఉంటుందని మరోసారి ఆరోపణలు చేశారు. కచ్చితంగా వైభవ్ వయస్సును గురించి ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అతనికి బోన్ టెస్ట్, లేదా డిఎన్ఏ పరీక్షలు చేస్తే కచ్చితంగా అసలు రంగు బయటపడుతుందని వ్యాఖ్యానించారు. అప్పటివరకు వైభవ్ వయసు గురించి తాను మాట్లాడుతూనే ఉంటానని కీలక వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్.
వైభవ్ సూర్య వంశీ పెద్ద ఆటగాడని బిల్డప్ ఇస్తున్నారని.. ఇండియన్ మీడియా పై కూడా విమర్శలు చేశారు తన్వీర్ అహ్మద్. అతడు పెద్ద ఆటగాడు కాదని.. గాల్లో బ్యాట్ ఉప్పడం తప్ప, అతడికి ఏదీ చాతకాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కళ్ళు మూసుకొని సిక్సర్లు, బౌండరీలు కొడుతున్నాడని విమర్శలు చేశారు. దమ్ముంటే ఇంగ్లాండ్ పై సెంచరీ చేయాలని.. అప్పుడే వైభవ్ గ్రేట్ బ్యాటర్ అని తానే ఒప్పుకుంటానని వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ పై సెంచరీ చేస్తే… బట్టలు లేకుండా తిరుగుతానని కూడా ఛాలెంజ్ విసిరారు. ఒక్కసారి వైభవ్ ఫామ్ కోల్పోతే… తిరిగి పుంజుకోవడం కష్టమేనని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అతని కెరీర్ ముగిసిన తర్వాత, వైభవ్ సూర్యవంశీ గురించి ఎవరూ మాట్లాడుకోరంటూ హాట్ కామెంట్స్ చేసారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==