Big Stories

Bangla Tour : టీమిండియా బంగ్లా టూర్.. షెడ్యూల్‌ ఇదే..?

Bangla Tour : టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా న్యూజిలాండ్ టూర్ కు వెళ్లింది. కివీస్‌ పర్యటన ముగియడంతో మరో సిరీస్‌ కు సిద్ధమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులను‌ ఆడనుంది. బంగ్లాదేశ్‌ వన్డే జట్టుకు తమీమ్‌ ఇక్బాల్ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే టెస్టు జట్టును ఇంకా ప్రకటించలేదు.

- Advertisement -

బంగ్లాదేశ్‌తో తొలుత మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ ఆడనుంది. ఆ తర్వాత రెండు టెస్టుల్లో తలపడనుంది. మ్యాచ్‌లు డిస్నీ+హాట్‌స్టార్‌తోపాటు స్టార్ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. వన్డేలు ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. టెస్టులు ఉదయం 9 గంటలకు మొదలుకానున్నాయి.

- Advertisement -

మెగా టోర్నీ ముగిశాక న్యూజిలాండ్‌ పర్యటనకు విశ్రాంతి తీసుకొన్న సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్‌ షమీ తిరిగి జట్టులోకి వచ్చారు పంత్‌తో పాటు వికెట్‌ కీపర్ల జాబితాలోకి ఇషాన్‌ కిషన్‌కు అవకాశం దక్కింది. సంజూ శాంసన్‌కు చోటు కల్పించలేదు. రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌ సాధిస్తే మ్యాచ్ లు ఆడతాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బుమ్రాను ఎంపిక చేయలేదు.

తొలి వన్డే: డిసెంబర్‌ 4, ఢాకా

రెండో వన్డే: డిసెంబర్ 7, ఢాకా

మూడో వన్డే: డిసెంబర్‌ 10, చిట్టగాంగ్‌


భారత్ వన్డే జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, విరాట్‌కోహ్లీ, రజత్‌ పటిదార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చాహర్‌, యశ్‌ దయాళ్‌.

బంగ్లాదేశ్‌ వన్డే జట్టు: తమీమ్‌ ఇక్బాల్ (కెప్టెన్), నజ్ముల్ హొస్సేన్ షాంటో, యాసిర్ అలీ, షకిబ్ అల్ హసన్, మహముదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, అఫిఫ్ హొస్సేన్ ధ్రుబో, ఎబాడట్‌ హొస్సేన్, అనముల్‌ హక్‌, లిటన్‌ దాస్‌, ముష్ఫికర్ రహీం, నురుల్ హసన్, హసన్ మహముద్, ముస్తాఫిజర్‌ రహ్మాన్‌, నసుమ్‌ అహ్మద్

తొలి టెస్ట్: డిసెంబర్‌ 14-‌ 18

రెండో టెస్ట్‌: డిసెంబర్ 22 – 26

భారత్ టెస్ట్ జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌యాదవ్‌

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News