E-Paper
Advertisement

OTT Movie : ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తమిళ సినిమాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie : ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తమిళ సినిమాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

OTT Movie : ఈ వారం తమిళ సినిమాలు ఓటీటీలో రచ్చ చేస్తున్నాయి. దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్‌అయిన సినిమాలను, ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఫ్యామిలీలకు ఫ్యామిలీలు తెగ చూసేస్తునారు. ‘బైసన్’ లో ధృవ్ విక్రమ్ కబడ్డీ హీరోగా రచ్చ చేస్తే, ‘నడు సెంటర్’ సిరీస్‌లో విజయ్ సేతుపతి కొడుకు సూర్య బాస్కెట్‌బాల్ తో బ్లాస్ట్ చేస్తున్నాడు. ఇక ‘డీజిల్’ లో హరీష్ కల్యాణ్ డీజిల్ మాఫియా గేమ్‌లో హీట్ పుట్టిస్తున్నాడు. ఈ మూడు యాక్షన్, స్పోర్ట్స్, ఎమోషన్ అన్నీ కలిపి పెర్ఫెక్ట్ వీకెండ్ ప్లాన్ గా ఉండనున్నాయి. ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయి ? వీటి వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

‘బైసన్’ (Bison)

కబడ్డీ ఆట ప్రధాన అంశంతో వచ్చిన ఈ తమిళ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇది ఒక కబడ్డీ ఆట మాత్రమే కాదు 1990ల్లో ఒక దలిత్ యువకుడు కుల వివక్ష, రౌడీలు, పాలిటిక్స్ ఎదుర్కొని ఆసియా గేమ్స్‌కి ఎలా వెళ్లగలిగాడో చూపిస్తుంది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ₹65 కోట్లు వసూలు చేసిన హిట్ జాబితాలో నిలిచింది. సెల్వరాజ్ డైరెక్షన్ లో ధృవ్ విక్రమ్ తనలోని యాక్షన్ ని ఫుల్ గా చూపించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో 2025 నవంబర్ 21నుంచి ఈ సినిమా అందుబాటులో ఉంది.

‘నడు సెంటర్’ (Nadu Center)

Advertisement

ఇందులో విజయ్ సేతుపతి కొడుకు సూర్య బాస్కెట్‌ బాల్ రచ్చ చేశాడు. ఈ స్టోరీ క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని, రౌడీ స్కూల్‌ పిల్లలతో బాస్కెట్‌ బాల్ టీమ్ ఫామ్ చేసి ఒక డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ గెలవాల్సి ఉంటుంది. సూర్య విజయ్ సేతుపతి ఫస్ట్ టైం హీరోగా అదరగొట్టాడు. ఈ యంగ్ గ్యాంగ్ ఎనర్జీ కూడా అదిరిపోయింది. ఇది సిరీస్ కాబట్టి వీక్లీ ఎపిసోడ్స్ వస్తాయి. JioHotstarలో నవంబర్ 20 నుంచి మొదటి 3 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కి వచ్చాయి. మిగతా 14 ఎపిసోడ్స్ వారానికి ఒకటి చొప్పున రిలీజ్ కానున్నాయి.

‘డీజిల్’ (Diesel)

డీజిల్ దొంగతనం, క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్, పాలిటిక్స్ … ఇవన్నీ కలిపిన ఒక యాక్షన్ థ్రిల్లర్ ‘డీజిల్’. ఇందులో హరీష్ కల్యాణ్ ఒక అడాప్టెడ్ సన్‌గా డీజిల్ బిజినెస్ రాజ్యం ఏలాలని అనుకుంటాడు. మధ్యలో పోలీస్, విలన్స్ ఎంట్రీతో స్టోరీ యాక్షన్ సీన్స్ తో హీట్ పుట్టిస్తుంది. ఇది 2025 నవంబర్ 21 నుంచి Sun NXT, Aha Tamil, Simply Southలలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

 

Read Also : స్విమ్మింగ్ పూల్ లో దెయ్యం… ఓటీటీలోకి వచ్చేసిన 485 కోట్ల హర్రర్ థ్రిల్లర్

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×