Masthan Sai – Lavanya: ప్రస్తుతం మస్తాన్ సాయిపై లావణ్య చేసిన ఫిర్యాదు, ఆ కేసు విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు ఈ మస్తాన్ సాయి ఎవరు, తనకు, రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యకు మధ్య గొడవ ఏంటి అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర ఎంతోమంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయి అనే దగ్గర ఈ కేసు మొదలయ్యింది. ఇప్పుడు ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడింది. అయితే అసలు మస్తాన్ సాయి, లావణ్య మధ్య గొడవ ఎక్కడ మొదలయ్యింది అనే విషయం కొంచెంకొంచెంగా బయటికి వస్తోంది. వీళ్ల సమస్యలో హీరో రాజ్ తరుణ్ కూడా ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది.
హత్యా బెదిరింపులు
అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీసిన కేసులో మస్తాన్ సాయిను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ మాత్రమే కాదు.. తన స్నేహితుడు ఖాజాను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అదే సమయంలో మస్తాన్ సాయికు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయాన్ని బయటపెట్టింది లావణ్య. దీంతో మస్తాన్ సాయి, ఖాజాలకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు పోలీసులు. అందులో వారిద్దరికీ పాజిటివ్ అని తేలింది. అందుకే వారిపై NDPS సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఒకానొక సందర్భంలో డ్రగ్స్ తీసుకొని లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడట మస్తాన్ సాయి. అంతే కాకుండా హత్యా బెదిరింపులు కూడా చేశాడని తెలుస్తోంది.
ఆ పార్టీలో మొదలు
అసలైతే 2022లో ఈ గొడవ మొదలయ్యింది. మస్తాన్ సాయి (Masthan Sai) ఇంట్లో నిర్వహించిన ఒక పార్టీకి లావణ్య కూడా వెళ్లింది. ఆ సమయంలో తను డ్రెస్ చేసుకుంటుండగా తన ఇంట్లోని సీక్రెట్ సీసీ కెమెరాల్లో రికార్డ్ చేశాడు మస్తాన్. ఆ విషయం లావణ్యకు తెలియక నవంబర్‌లో మస్తాన్ నిర్వహించిన మరొక పార్టీకి కూడా వెళ్లింది. అదే సమయంలో తనకు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చి, మద్యం తాగిచ్చి తన ప్రైవేట్ వీడియోలను తీశాడు. ఈ విషయం తన స్నేహితుల ద్వారా బయటపడింది. అప్పటినుండి తన వీడియోలు డిలీట్ చేయమని లావణ్య ఎంత అడిగినా మస్తాన్ వినలేదు. అంతే కాకుండా పోలీసులకు ఈ విషయాన్ని చెప్తే తన వీడియోలు బయటపెడతానని కూడా బెదిరించాడని తెలుస్తోంది.
Also Read: పవన్‌ను అంటే ఊరుకోను… సింగనమల రమేష్‌కు బండ్ల వార్నింగ్
రాజ్ తరుణ్ జోక్యం
లావణ్య (Lavanya) ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయని తెలిసి రాజ్ తరుణ్ రంగంలోకి దిగాడట. రాజ్ తరుణ్ (Raj Tarun) జోక్యంతో మస్తాన్ వీడియోలు డిలీట్ చేశాడట. కానీ డిలీట్ చేసేలోపే ఆ వీడియోలను చాకచక్యంగా వేరే డివైజ్‌ల్లోకి పంపించుకున్నాడు మస్తాన్. ఆ తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెప్పినందుకు లావణ్యను చంపాలని డిసైడ్ అయ్యాడు. అందుకే జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు మస్తాన్ సాయి. తనపై హత్యాయత్నం కూడా జరగడంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది లావణ్య. ఈ కేసు విషయం బయటపడినప్పటి నుండి ఎన్నో మలుపులు తిరుగుతోంది.