E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

గద్వాల్ జిల్లాలో దారుణం.. ప్రారంభానికి ముందే బీటలు వారిన కొత్త హాస్పిటల్..!

గద్వాల్ జిల్లాలో దారుణం.. ప్రారంభానికి ముందే బీటలు వారిన కొత్త హాస్పిటల్..!
Advertisement

Hospital Cracks: స్వేచ్ఛ బ్యూరో: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ పట్టణంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఇంకా భవనం అందుబాటులోకి రాకముందే గోడలు, పిల్లర్లకు భారీగా పగుళ్లు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ భవనం నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి కట్టినట్లు స్పష్టమవుతోంది.

నాసిరకం మెటీరియల్.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం

ప్రాంతీయ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టింది. అయితే, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణంలో అత్యంత నాసిరకం ఇసుక, తక్కువ నాణ్యత గల సిమెంట్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. పునాదులు, నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే భవనం అంతటా పగుళ్లకు దారితీశాయని ప్రజలు భావిస్తున్నారు. దీనికి తోడు భవనానికి అమర్చిన కిటికీలు, వాటి అద్దాలు ఇప్పటికే ధ్వంసమై ఊడిపోతున్నాయి. సరైన నాణ్యత లేని ఫిట్టింగ్స్ వాడటం వల్లే ఇవి విరిగిపోయినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Also read: ఆంధ్రా వర్సెస్ తెలంగాణ… కాంట్రవర్సీకి తెరలేపిన ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ !

ప్రజల ఆగ్రహం.. ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్

రూ. కోట్ల ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం కావడంపై అయిజ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిని ప్రారంభించక ముందే భవనం ఇంతలా దెబ్బతింటే, రేపు వందలాది మంది రోగులు వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైద్య సేవలు అందాల్సిన వేళ, ఆసుపత్రి భవనమే ప్రమాదకరంగా మారడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Also read: ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారా?.. డబ్ల్యూహెచ్‌ఓ షాకింగ్ రిపోర్ట్..!

Related News

ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారా?.. డబ్ల్యూహెచ్‌ఓ షాకింగ్ రిపోర్ట్..!

ఏపీ తరహా ఇబ్బందులు వద్దే వద్దు.. ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు!

ములుగు జిల్లా రైతులకు గుడ్ న్యూస్.. పాత భూసేకరణ ధరలు రద్దు..!

Vegetable Prices: కూరగాయల ధరల దెబ్బకు.. సామాన్యుడి గుండె గుభేల్..!

సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లలో వింత పరిస్థితి.. ఎంత చెప్పినా పట్టించుకోని ప్రభుత్వం..!

తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. అధికారం కోసం ఎంట్రీ ఇస్తున్న అగ్ర వ్యూహకర్త..?

ఖైదీలు విడుదలయ్యాక కూడా వదలని ఆఫీసర్లు.. ఫోన్ నెంబర్లు తీసుకుని మరీ..?

Big Stories

×