Shoaib Akhtar warns Babar Azam: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాల్టి నుంచి ఈ రెండు టీమ్స్ మధ్య వార్మప్ మ్యాచ్ షురూ కానుంది. ఆగస్టు 19వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య లీడ్స్ (Headingley, Leeds) వేదికగా తొలి టెస్ట్ ఉంటుంది. ఇలాంటి క్రమంలో గెలుపే లక్ష్యంగా పాకిస్తాన్ క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. వెస్టిండీస్ జట్టును చిత్తు చేసి, ఇంగ్లాండుకు వెళ్లిన బాబర్ ఆజంకు (Babar Azam) పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెస్టిండీస్ ను ఓడించినంత ఈజీగా.. ఇంగ్లాండ్ జట్టును ఓడించలేరని బాంబు పేల్చారు. ఇంగ్లాండ్ ను ఓడించాలంటే, 1000 ఏనుగుల బలం కావాల్సిందేనని హెచ్చరించారు. లేకపోతే ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ ఒక్క విజయం కూడా నమోదు చేయడం కష్టమేనని తేల్చి చెప్పారు.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజంకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు షోయబ్ అక్తర్. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ సిరీస్ లో పాకిస్తాన్ అద్భుతంగా రాణించి గెలిచినంత ఈజీగా… ఇంగ్లాండ్ పర్యటనలో ఉండ బోదని హెచ్చరించారు. ఇంగ్లాండ్ జట్టును ఓడించాలంటే, చాలా కసరత్తులు చేయాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించారు. వెస్టిండీస్ జట్టు చేసిన తప్పులను ఇంగ్లాండు చేయబోదని హెచ్చరించారు. పాకిస్తాన్ గెలిచే స్థితికి రావడానికి, వెస్టిండీస్ ఛాన్స్ ఇచ్చింది.. కానీ ఇంగ్లాండు మాత్రం ఎలాంటి తప్పిదం చేయదని స్పష్టం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఇంగ్లాండును ఓడించాలని కోరారు.
ఇంగ్లాండ్ జట్టు… పాకిస్తాన్ బ్యాటింగ్ బలహీనతలను దృష్టిలో పెట్టుకొని బౌలింగ్ చేస్తుందని వివరించారు షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ). ఫాస్ట్ బౌలింగ్ తో పాటు సీమ్ కు అనుకూలించే కఠినమైన మైదానాలను వాళ్ళు సిద్ధం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. అలాంటి మైదానాలలో ఆడటం పాకిస్తాన్ క్రికెటర్లకు కష్టతరం అవుతుందన్నారు. వాళ్ల బౌలింగ్ కు పాకిస్తాన్ కుప్పకూలుతుందని హెచ్చరించారు.
పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న బాబర్ ఆజంకు ఇంగ్లాండ్ టూర్ అగ్నిపరీక్ష అని చెప్పవచ్చు. ఇక్కడ కనక పాకిస్తాన్ జట్టును గెలిపించకపోతే, మళ్లీ బాబర్ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. ఈ క్రమంలో జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యతను బాబర్ ఆజం తీసుకోవాలన్నారు.