రిచర్డ్ కెటిల్‌బొరో… ఈ పేరు వింటేనే భారత క్రికెట్ అభిమానులు వణికిపోతారు. ఎందుకంటే… అతను అంపైర్ గా ఉన్న అన్ని మెగా టోర్నీల్లోనూ నాకౌట్ మ్యాచ్ ల్లో టీమిండియా ఓడిపోయింది కాబట్టి. ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్-ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ కు ICC ప్రకటించిన అంపైర్ల జాబితాలో రిచర్డ్ కెటిల్‌బొరో పేరు లేకపోవడంతో… విజయంపై టీమిండియా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో రిచర్డ్ కెటిల్‌బొరో అంపైర్‌గా వ్యవహరించిన ప్రతి నాకౌట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. రిచర్డ్ ఫీల్డ్ అంపైర్‌గా లేదా థర్డ్ అంపైర్‌గా వ్యవహరించిన 2014 T20 వరల్డ్‌కప్ ఫైనల్లో, 2015 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో, 2016 T20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. దాంతో… రిచర్డ్ కెటిల్‌బొరో అంపైర్ గా ఉంటే అంతే అనే అభిప్రాయం భారత అభిమానుల్లే ఏర్పడిపోయింది.
న్యూజిలాండ్-పాకిస్తాన్ సెమీస్ మ్యాచ్ లో మరయిస్ ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లను ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా, రిచర్డ్ కెటిల్‌బొరో, మైఖేల్ గాఫ్‌లను థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా ప్రకటించింది… ICC. ఇక ఈ మ్యాచ్‌కు రిఫరీగా క్రిస్ బ్రాడ్ వ్యవహరించనున్నాడు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు… కుమార ధర్మసేన, పాల్ రిఫిల్‌లను ఫీల్డ్ అంపైర్లుగా… క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్‌లను థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా ప్రకటించింది… ICC.డేవిడ్ బూన్ సెకండ్ సెమీస్ కు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.