Ind vs SA: టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండో టి20 మ్యాచ్ ఇవ్వాళ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లోగెలుస్తుందనుకున్న టీమిండియా చివరికి ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా చేతిలో 3 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. చివర్లో స్టబ్స్ 41 బంతుల్లో 47 పరుగులు, కోయేటీజి 9 బంతులో 19 పరుగులు చేసి దుమ్ము లేపారు.
దీంతో టీమ్ ఇండియా ఓడిపోవడం జరిగింది. టీమిండియా పెట్టిన 125 పరుగుల లక్ష్యాన్ని… ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది సౌత్ ఆఫ్రికా. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఏకంగా 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
అయినప్పటికీ చివర్లో ఫాస్ట్ బౌలర్లు.. చేతులెత్తేశారు. దీంతో వరుణ్ చక్రవర్తి కష్టానికి ఫలితం దక్క లేకపోయింది. ఈ తరుణంలోనే నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది సఫారీ జట్టు. 13వ తేదీన మూడవ టి20 మ్యాచ్ జరగనుంది.