RCB Fan Died: రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) మొదటిసారి ఛాంపియన్ కావడం ఏమో కానీ… గుట్టలు గుట్టలుగా శవాలయితే తేలుతున్నాయి. రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు జట్టుపై ఉన్న అభిమానంతో.. నిన్న చిన్న స్వామి వద్దకు… దాదాపు మూడు లక్షల మంది అభిమానులు వచ్చారు. ఈ తరుణంలోనే పరిస్థితి అదుపుతప్పడం.. దాంతో లాఠీచార్జి జరగడం… చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఏకంగా 11 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
గుండెపోటుతో బెంగళూరు అభిమాని మృతి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అందిన సంగతి తెలిసిందే. అయితే సంబరాలతో పాటు వరుసగా విషాదాలు కూడా జరుగుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు గెలుపు సంబరాలు చేసుకుంటూ తాజాగా మరో అభిమాని మృతి చెందారు. గుండెపోటుతో తాజాగా రాయల్ చాలెంజెస్ బెంగళూరు అభిమాని మృతి చెందాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావి ప్రాంతంలో చోటుచేసుకుంది. ( Indian Premier League 2025 Tournament )
18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచిందన్న ఆనందంలో… మంజునాథ
ఈరప్ప కంబార్ అనే 28 సంవత్సరాల కుర్రాడు స్నేహితులతో కలిసి డ్యాన్సులు చేశాడు. డీజే బాక్సులు పెట్టుకొని మరి… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలోనే స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగానే 28 సంవత్సరాల మంజునాథ ఈరప్ప కంబార్ కుప్పకూలాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మంజునాథ ఈరప్ప కంబార్. దీంతో బెళగవి లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇది ఇలా ఉండగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన అభిమాని మంజునాథ ఈరప్ప కంబార్ భార్య ప్రస్తుతం గర్భిణి.. అని సమాచారం అందుతోంది. ఇక ఆమె భర్త మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు విజయవాడలో… బైక్ పై వెళుతూ సంబరాలు చేసుకున్న శేఖర్ అనే 30 సంవత్సరాల యువకుడు కింద పడి మరణించాడు.
Also Read: Stampede at RCB Parade: RCB విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..7 మంది ఫ్యాన్స్ మృతి, 20 మందికి గాయాలు
తొక్కిసలాట పై విరాట్ కోహ్లీ కీలక ప్రకటన..
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కలాటపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశారు. ఈ సంఘటనపై మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ అయ్యారు విరాట్ కోహ్లీ. ఈ బాధ వర్ణనాతీతం అంటూ… పోస్ట్ పెట్టారు విరాట్ కోహ్లీ. అలాగే హార్ట్ బ్రేకింగ్ ఎమోజిని జోడించారు. ఇది ఇలా ఉండగా చిన్న స్వామి స్టేడియం దగ్గర 11 మంది మృతి చెందారు. 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో 10 మంది ఐసీఈలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.