Travis Head wife: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ట్రావిస్ హెడ్ ( Travis Head) వర్సెస్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore ) మధ్య మే 22వ తేదీన మ్యాచ్ జరగగా.. ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ట్రావిస్ హెడ్ షేక్ హ్యాండ్ ( Shake Hand) ఇచ్చినప్పటికీ… విరాట్ కోహ్లీ తన బలుపు బయట పెట్టుకున్నాడు. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించాడు విరాట్ కోహ్లీ. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై రెచ్చిపోయిన విరాట్ కోహ్లీ అభిమానులు..ట్రావిస్ హెడ్ భార్య జెస్సికాను ( Jessica Head) రే**ప్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో 6000 కి అమ్మేస్తామని దారుణంగా పోస్టులు పెట్టారు.
సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ అభిమానులు బరితెగించిన నేపథ్యంలో స్వయంగా ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా రంగంలోకి దిగారు. అనవసరంగా తన కుటుంబాన్ని విరాట్ కోహ్లీ ( Virat Kohli) అభిమానులు గెలికారని ఆమె మండిపడ్డారు. తనను కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారని సీరియస్ అయ్యారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టు పతనం ఇక మొదలైందని.. తన భర్త మీ అంతు చూస్తాడని విరాట్ కోహ్లీ అభిమానులకు జెస్సికా హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ ఫైనల్స్ లో బెంగుళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( RCB VS SRH) మధ్య మ్యాచ్ జరిగితే.. తన భర్త అరాచకం సృష్టించడం గ్యారెంటీ అంటూ జెస్సికా హెడ్ షాకింగ్ పోస్ట్ పెట్టారు.
మే 22వ తేదీన మ్యాచ్ జరిగితే ఉదయం లేచేసరికి తన సోషల్ మీడియా వేదికగా పచ్చి బూతులు పెట్టారని ఆమె సీరియస్ అయ్యారు. నోటితో చెప్పరాని మాటలను అన్నారని విరాట్ కోహ్లీ అభిమానులపై ఫైర్ అయ్యారు. ఈ ఫ్యాన్స్ ను అదుపులో పెట్టాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ పైన ఉందని వ్యాఖ్యానించారు. ఇలా బరితెగించి ప్రవర్తిస్తే అస్సలు కుదరదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగాక తన భర్తకు కూడా వెనక్కి తగ్గబోడని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఇక ఇదే అదునుగా చూసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు… హెడ్ వెంటనే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులోకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఐపీఎల్ ను వదిలేయాలని సూచనలు చేస్తున్నారు.