BigTV English

Twitter :- కోహ్లీ, ధోనీ, రోహిత్‌కు ట్విటర్ షాక్… బ్లూటిక్ మాయం

Twitter :- కోహ్లీ, ధోనీ, రోహిత్‌కు ట్విటర్ షాక్… బ్లూటిక్ మాయం

Twitter :- ఎలన్ మస్క్ ఎంతటి వారైనా వదలడం లేదు. సబ్‌స్క్రిప్షన్ తీసుకోకపోతే.. నిర్మొహమాటంగా బ్లూటిక్ తీసేస్తున్నాడు. ఆ బ్లూటిక్ ఉంటేనే ఆథరైజ్డ్ అకౌంట్ అని అర్థం. లేదంటే.. ఒక్కో సెలబ్రిటీ పేరు మీద లక్షల అకౌంట్లు పుట్టుకొస్తాయి. ఇలా సబ్‌స్క్రిప్షన్ తీసుకోనందుకు క్రికెట్ దిగ్గజాలు.. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ట్విటర్ అకౌంట్ బ్లూటిక్ తీసేశారు. వీళ్లే కాదు.. ఇండియాలో టాప్ సినీ హీరోలు, హీరోయిన్లు, పొలిటికల్ లీడర్స్, వీఐపీలు.. ఇలా సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వాళ్లందరి బ్లూటిక్స్ పీకేసింది ట్విటర్.


ఇప్పటి వరకు కొహ్లీ, రోహిత్, ధోని ట్విటర్ అకౌంట్లకు లెగసీ బ్లూటిక్ ఉంది. దీని కారణంగానే వీళ్ల అకౌంట్లకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. వీళ్లు ఒక్క ట్వీట్ చేస్తే అంత క్రేజ్ వస్తోంది. మస్క్ రానంత వరకు వెరిఫికేషన్ టిక్ ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు మస్క్ వచ్చాడు, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చాడు. వెరిఫైడ్ బ్లూటిక్ కోసం యూజర్లు డబ్బులు చెల్లించాల్సిందేనని, చెల్లించని వారి ప్రొఫైల్స్ నుంచి బ్లూటిక్ మార్క్‌ను తీసేస్తామని ఓ డెడ్ లైన్ పెట్టారు. మస్క్ స్టేట్ మెంట్‌ను తేలిగ్గా తీసుకున్నారు కాబోలు.. అందరి ట్విటర్ అకౌంట్ల నుంచి బ్లూటిక్ ఎగిరిపోయింది.

ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్లు 4 వేల క్యారెక్టర్ల వరకు టెక్ట్స్ పంపించుకోవచ్చు. అదే, ఇతరులు అయితే 280 క్యారెక్టర్లకు మించి పంపలేరు. అంతేకాదు, బ్లూ సబ్‌స్క్రైబర్లు 60 నిమిషాల నిడివి ఉన్న వీడియో లేదంటే 2జీబీ వరకు ఉన్న వీడియోను కూడా పంపుకోవచ్చు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×